Coolie shooting Wrapped up: రజినీకాంత్ .. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హై యాక్టేన్ యాక్షన్ ఎంటర్టేనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగు సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక హీరోగా కమల్ హాసన్ పనై పోయిందనుకున్న సమయంలో ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇపుడు రజినీకాంత్ తో ‘కూలీ’ వంటి యాక్షన్ మూవీలో ఎలా చూపించబోతున్నాడనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రజినీకాంత్ కూడా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘లాల్ సలాం’, ‘వేట్టాయ్యన్’ మూవీలు అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. అందులో ‘లాల్ సలాం’ మూవీ కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. అటు వేట్టయ్యాన్ మూవీ ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ‘కూలి’ మూవీతో రజినీకాంత్ దేవా క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమాతో రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు అభిమానులు. ఈ సినిమాలో నాగార్జున .. సైమన్ అనే నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర .. ‘కలేష్’ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.
It's a super wrap for #Coolie ?@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/ulcecQKII1
— Sun Pictures (@sunpictures) March 17, 2025
అటు బాలీవుడ్ అగ్ర హీరో ఆమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తూన్న ఈ చిత్రం పూజా హెగ్డే మరో ముఖ్యపాత్రలో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముగియడంతో గుమ్మడికాయ కొట్టేసారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ పూర్తైయినట్టు చిత్ర యూనిట్ ఓ వీడియోను ఎక్స్ లో షేర్ చేసింది. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. మరోవైపు రజినీకాంత్.. నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ సినిమా స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో బాలయ్య అతిథి పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









