)
Suprerstar Rajini kanth Praises nandamuri Balakrishna: సూపర్ స్టార్ రజనీకాంత్ నందమూరీ బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బాలయ్యపై తనకున్న ప్రత్యేకమైన అభిమానంను, ప్రేమను చాటుకున్నారు. బాలయ్య ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఉంటాయన్నారు. ఆయన చుట్టుపక్కల అస్సలు నెగెటివిటి ఉండదన్నారు.
ఆయన ఉన్న చోట సంతోషం ఉంటుందన్నారు. అంతే కాకుండా బాలయ్య సినిమాల్ని ఆయన అభిమానులే కాకుండా మిగత హీరోల అభిమానులు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు.
Thalaivar will be the first person to appreciate anyone's success or milestone ✨️❤️
Here is @rajinikanth appreciating #NandamuriBalakrishna for 50 mass years in Cinema ?
Can't wait for their explosion together in #Jailer2 ????#Coolie #Akhanda2pic.twitter.com/adIRSxENev
— Achilles (@Searching4ligh1) August 30, 2025
అంతే కాకుండా.. నందమూరీ బాలకృష్ణ సినిమాల్లోని కొన్ని పంచ్ డైలాగ్ లు కూడా కొట్టి రజనీకాంత్ అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. రజనీకాంత్ మాట్లాడుతూ.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదని డైలాగ్ కొట్టారు. ఆ తర్వాత కత్తితో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా.. అంటూ కూడా మరో డైలాగ్ ను పేల్చారు.
అయితే.. ఇలాంటి పంచ్ డైలాగ్ లను కొట్టడం బాలయ్యకు మాత్రమే సాధ్యమౌతుందని రజనీ కాంత్ అన్నారు. అంతే కాకుండా..ఆయన ఇండస్ట్రీలో 75 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకొవాలని మనస్పూర్తిగా ఆదేవుడ్ని కోరుకుంటున్నట్లు ఐలవ్యూ బాలయ్య అంటూ తన అభిమానంను అందరితో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.