Mandaadi Movie First Look: డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటుడు సుహాస్.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న మందాడి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్‌ఫోఎంటైన్‌మెంట్ నిర్మిస్తోంది. సూరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. సుహాస్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మందాడి మూవీ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో అంచనాలు పెరిగిపోయాయి.
ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలవ్వగా.. రామనాథపురం తీర ప్రాంతాలలో టెస్ట్ షూట్ కంప్లీట్ అయింది. బోట్ రేస్ అంటూ తీర ప్రాంతాలను కళ్ల కట్టినట్లు చూపించనున్నట్లు పోస్టర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా సెయిల్ బోట్ రేసింగ్‌పై ఒక డాక్యుమెంట్ వీడియోను మేకర్స్ ప్రదర్శించారు. మందాడి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. మందాడి అంటే రామనాథపురం, ట్యూటికోరిన్ తీరప్రాంతాలలో నాయకత్వం వహించే అనుభవజ్ఞుడైన నిపుణుడు అని అర్థం.
ఈ సందర్భంగా డైరెక్టర్ మతిమారన్ పుగళేంది మాట్లాడుతూ.. నటుడిగా సూరి ఎంచుకుంటున్న పాత్రలు ప్రశంసనీయమని.. ఈ క్యారెక్టర్ ఆయన కోసం రాయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దూరదృష్టితో ఆయన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారని అన్నారు. మందాడి మూవీ సూరి కెరీర్‌లో ప్రత్యేక మైలు రాయిగా నిలిచిపోనుందన్నారు. వెట్రి మారన్ ఈ ప్రాజెక్ట్ వెనుకాల ఉండి తమకు మార్గనిర్దేశం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్ ఈ.రాఘవ్, కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వర్క్ చేస్తున్నారు.
టెక్నీకల్ టీమ్:
==> సహ నిర్మాత: వి.మణికందన్
==> కాస్ట్యూమ్ డిజైన్: దినేష్ మనోహరన్
==> కొరియోగ్రాఫర్: అజర్
==> DI: క్లెమెంట్
==> పబ్లిసిటీ స్టిల్స్: కబిలన్
==> స్టిల్ ఫోటోగ్రాఫర్: జి.ఆనంద్ కుమార్
==> పబ్లిసిటీ డిజైన్: సౌందర్య కుంజమ్మ
==> ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎస్‌పీ చొక్కలింగం
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి.మహేష్
==> PRO: సాయి సతీష్ (తెలుగు)
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









