Suryapet Junction: సూర్యాపేట్ జంక్షన్ విడుదల తేది ఖరారు.. ఎప్పుడంటే..?

Suryapet Junction movie: ఈశ్వర్, నైనా సర్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా ‘సూర్యాపేట్ జంక్షన్’ ఈ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం తెలుగురాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, "మ్యాచింగ్.. మ్యాచింగ్" పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Written by - Vishnupriya | Last Updated : Apr 19, 2025, 06:41 PM IST
Suryapet Junction: సూర్యాపేట్ జంక్షన్ విడుదల తేది ఖరారు.. ఎప్పుడంటే..?

Suryapet Junction April 25: ఈశ్వర్, నైనా సర్వర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. వైవిద్యమైన కథతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోతోంది ఈ చిత్రం. ఇక ఈ సినిమా విడుదల తేదీని సినిమా యూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వ్యక్తి రాజేష్ నాదెండ్ల. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

Add Zee News as a Preferred Source

తెలుగు రాష్ట్రాల్లో గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు సోషల్ మీడియా వేదికగా విశేష స్పందన లభించింది. అలాగే రీసెంట్‌గా రిలీజ్ అయిన “మ్యాచింగ్.. మ్యాచింగ్” పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ –  
“మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలకు వచ్చిన స్పందన చూసి మాకు మరింత నమ్మకము కలిగింది. కథలో నాటకీయత, యాక్షన్ సన్నివేశాలు సహజంగా ఉండటంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. మీరందరూ థియేటర్లలో వచ్చి సినిమాను చూసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా" అని చెప్పారు.

ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ –  
“సూర్యాపేట్ జంక్షన్‌ను గ్లోబల్ సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మాకు సహకరించిన సునీల్ గారికి, రాంమోహన్ గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు థియేటర్లలో ఆస్వాదించాలని కోరుతున్నాం" అని తెలియజేశారు.

ఈ ఏప్రిల్ 25న థ్రిల్లింగ్ యాక్షన్, కథా మలుపులతో కూడిన 'సూర్యాపేట్ జంక్షన్' మీ సమీప థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News