JINN Movie: స్టోరీలో స్టఫ్ ఉంటే.. నటీనటులతో సంబంధం లేకుండా సినిమాలు హిట్ అందుకుంటున్నాయి. హర్రర్ థ్రిల్లర్ లవర్స్ అయితే.. కాస్త డిఫరెంట్‌గా తీసి సూపర్ ట్విస్టులతో మెప్పిస్తే మంచి విజయాన్ని కట్టబెడతారు. ఇలా ఓ డిఫరెంట్ ఫార్మూలాను తీసుకుని.. సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ జానర్‌లో జిన్ అనే మూవీని తెరకెక్కించారు దర్శకుడు చిన్మయ్ రామ్. అన్ని వర్గాల ఆడియన్స్‌ను మెప్పించేలా ఈ సినిమాను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. అమిత్ రావ్ హీరోగా యాక్ట్ చేస్తుండగా.. పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి ప్రధాన పాత్రలు పోషించారు. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై నిఖిల్ ఎమ్.గౌడ నిర్మించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జిన్ అనే ఈ మూవీకి ప్లస్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. హైదరాబాద్‌తోపాటు కథకు సెట్ అయ్యే లోకేషన్స్‌లో షూటింగ్ చేసినట్లు వెల్లడించారు.
స్ట్రాంగ్ కంటెంట్‌తో మూవీ తీశామని.. ప్రజెంటేషన్ చాలా బాగుందని అంటున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు ఎన్నో హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూసి ఉంటారని.. కానీ జిన్ మూవీ మాత్రం అన్నింటిలోకి చాలా డిఫరెంట్ అని నమ్మకంగా చెబుతున్నారు. సూపర్ సక్సెస్ కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి అలెక్స్ మ్యూజిక్ అందివ్వగా.. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ రాశారు. సినిమాటోగ్రఫర్‌గా సునీల్ హొన్నాళి వర్క్ చేయగా.. ఎడిటింగ్ బాధ్యతలు కీర్తి రాజ్ డి నిర్వర్తించారు.
టెక్నికల్ టీమ్
==> ప్రొడ్యూసర్ - నిఖిల్ ఎమ్ గౌడ
==> డైరెక్టర్ - చిన్మయ్ రామ్
==> మాటలు- వరదరాజ్ చిక్కబళ్లాపుర
==> కథ స్క్రీన్ ప్లే - పర్వీజ్ సింభ
==> మ్యూజిక్- అలెక్స్
==> ఎడిటర్ - కీర్తి రాజ్ డి
==> సినిమాటోగ్రఫీ - సునీల్ హొన్నాళి
==> PRO - ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)
Also Read: Harshali Malhotra: అఖండ 2లో బాలయ్య కూతురుగా నటించిన హర్షాలి మల్హోత్ర బ్యాగ్రౌండ్ తెలుసా..
Also Read: Thiruveer: తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో.. బేబీ ఫోటో షేర్ చేస్తూ ఆనందం, పోస్ట్ వైరల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









