
Tamannaah Bhatia Movies : టాలీవుడ్లో మిల్క్ బ్యూటీగా పాపులర్ అయిన తమన్నా భాటియా ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్‌లో బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకెళ్తోంది. ఓ సైడ్‌గా బాలీవుడ్ సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు, అలానే కొన్ని తెలుగు సినిమాలతో కూడా బిజీగా మారింది.
తాజాగా ఆమె నటించిన ఓదెల 2 సినిమాతో మళ్లీ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. తమన్నా భాటియా తొలిసారిగా నాగ సాధువు పాత్రలో నటించిన సినిమా ఓదెల 2. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణ వహించిన ఈ చిత్రం సినిమాటిక్‌గా, కథ పరంగా సరికొత్తగా తెరకెక్కింది. విడుదలైన వెంటనే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా గాని.. తమన్నా పెర్ఫార్మెన్స్కు మాత్రం విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
Tamannaah Bhatia Remuneration : అయితే తమన్నా ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో కనిపిస్తోంది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా, అఖ్రీ సచ్, స్త్రీ 2, వేదా వంటి ప్రాజెక్ట్స్‌లో నటించి అభిమానుల మనసు గెలుచుకుంది. ప్రస్తుత ఆమె వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్స్ అని చెప్పవచ్చు.
Tamannaah Bhatia Net Worth: తమన్నా ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం, ఆమె ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఓదెల 2 సినిమాకూ భారీ రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. ఇలా ఆమె రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తోంది. మరోపక్క ఐటెం సాంగ్స్ కి కూడా 5 కోట్ల వరకు చాట్ చేస్తూందట.
Tamannaah Bhatia Real Estate And Cars: తమన్నా సంపాదించిన డబ్బును అంతా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతోంది. ముంబైలో వెర్సోవాలో 14వ ఫ్లోర్లో అపార్ట్మెంట్, అలాగే లోఖండ్వాలాలో మూడు అపార్ట్మెంట్లు కలిగి ఉంది. వాటి మొత్తం విలువ సుమారు రూ.7.84 కోట్లు.
ఆమె కార్ కలెక్షన్ వివరాల్లోకి వస్తే:
- బీఎండబ్ల్యూ 320i – రూ.43.50 లక్షలు
- మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ – రూ.1.02 కోట్లు
- పాజారో స్పోర్ట్ – రూ.30 లక్షలు
- ల్యాండ్ రోవర్ – రూ.75.59 లక్షలు
ఈ సమాచారం ప్రకారం, తమన్నా నికర ఆస్తుల విలువ సుమారుగా రూ.120 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
కొత్త తరం హీరోయిన్ల పోటీ పడి మరి దూసుకుపోతున్న తమ.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు, వెబ్ కంటెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.