Tamannaah - Kajal: తెలిసి ముట్టుకున్నా.. తెలియక ముట్టుకున్న నిప్పు కాలుస్తుందన్న సంగతి తెలిసిందే కదా. ఇపుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల, తమన్నాల విషయంలో అదే ప్రూవ్ అయింది. వీళ్లిద్దరు తాజాగా క్రిప్టో కరెన్సీ కేసులో చిక్కుకున్నారు కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. చెన్నై, పుదుచ్చేరికి చెందిన పదిమంది నుంచి సుమారుగా రూ. 2.40 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
క్రిప్టో కరెన్సీకి సంబంధించి 2022లో కోయంబత్తూరులో జరిగిన లాంచింగ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్‌లో భాగస్వాములుగా ఉండవచ్చనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఈవెంట్లో పాల్గొన్నందుకు డబ్బులు ఎలా ఇచ్చారు, ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు అనే వివరాలను పుదుచ్చేరి పోలీసులు సేకరించనున్నారు. కాజల్ అగర్వాల్ విషయానికొస్తే.. ఈ యేడాది ‘ఇండియన్ 3’, కన్నప్ప తో పాటు సికిందర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్నా విషయానికొస్తే.. త్వరలో ‘ఓదెల 2’ మూవీతో పలకరించబోతుంది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









