Odela 2 Review:‘ఓదెల 2’ మూవీ రివ్యూ.. సీక్వెల్ ఎలా ఉందంటే..!

Odela 2 moview Review: ప్రస్తుతం తెలుగులో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా సినిమా హిట్టైయితే.. దానికి కొనసాగింపుగా కాస్త స్టోరీ రెడీ చేసుకొని సీక్వెల్స్ చుట్టేస్తున్నారు. అందులో మెజారిటీ చిత్రాలు ఫస్ట్ పార్ట్ ఇంపాక్ట్ తో ఆడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన మరో సీక్వెల్ చిత్రం ‘ఓదెల 2’. ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 17, 2025, 01:09 PM IST
Odela 2 Review:‘ఓదెల 2’  మూవీ రివ్యూ.. సీక్వెల్ ఎలా ఉందంటే..!

మూవీ రివ్యూ: ఓదెల 2 (Odela 2)
నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, శ్రీకాంత్ అయ్యంగార్,మురళీ శర్మ  తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్   
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
రైటర్, స్క్రీన్ ప్లే, మాటలు: సంపత్ నంది
నిర్మాత: డి.మధు
దర్శకత్వం: అశోక్ తేజ
విడుదల తేది: 17-4-2025

Add Zee News as a Preferred Source

తమన్నా లీడ్ రోల్లో సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల 2’. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
ఓదెల గ్రామం నేపథ్యంలో ఈ సినిమాకు ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు కొనసాగింపుగా ‘ఓదెల 2’  మూవీ తెరకెక్కించారు. ఓదెల గ్రామంలో పెళ్లైన ఆడపిల్లను శోభనం రాత్రే కిడ్నాప్  చేసి వారిని అనుభవించి చంపేస్తూ ఉంటాడు తిరుపతి (వశిష్ఠ ఎన్ సింహా).  ఈ విషయం తెలుసుకున్న తిరుపతి భార్య రాధ (హెబ్బా పటేల్)అతన్ని తల నరికి చంపేస్తోంది. ఊరిలో ఎక్కుమ మంది ఆడవాళ్ల మానాన్ని ప్రాణాన్ని హరించిన తిరుపతి ఆత్మకు క్షోభ పడాలని  ఆ ఊరి వాళ్లు తగలపెట్టకుండా సమాధి శిక్ష విధిస్తారు. ఆ తర్వాత అనుకోని సంఘటనల వలన ఆ సమాధి నుంచి తిరుపతి బయటకు వచ్చి మునుపటిలా ఆ ఊర్లో పెళ్లైన ఆడవాళ్ల మాన, ప్రాణాలను వేరే వాళ్లలో ప్రవేవించి వారిని చంపేస్తుంటాడు. అయితే.. సమాధి నుంచి బయటకు వచ్చిన తిరుపతి ఆత్మను దిగ్బంధించడానికి నాగ సాధువు  భైరవి(తమన్నా)ఈ ఊరుకు వస్తోంది.ఎక్కడో కాశీలో తపస్సు చేసుకుంటూ ఉండే భైరవి ఓదెల గ్రామానికి ఎందుకు వచ్చింది. ఊరిపై అరాచకం చేస్తోన్న తిరుపతి ఆత్మను దగ్భందించి ఆ ఊరును కాపాడిందా లేదా అనేదే ‘ఓదెల 2’ మూవీ స్టోరీ.

కథనం టెక్నికల్ విషయానికొస్తే..

దుష్ట శక్తి.. దైవ శక్తికి అనాది నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ముందుగా దుష్ట శక్తి పై చేయి సాధించినా.. చివరగా దైవశక్తే విజయం సాధిస్తుంది. ప్రస్తుతం సినిమాల్లో హిందుత్వ అంశాలతో తెరకెక్కిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే దర్శకుడు సంపత్ నంది ‘ఓదెల 2’ వంటి సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఓదెల 2’ . ఈ సినిమాను దర్శకుడు మొదటి భాగానికి కొనసాగింపుగా తెరకెక్కించాడు. ముందుగా ఈ సినిమాలో అష్టాదశ పురాణాల్లో శివ పురాణం సహా ఇతర పురాణాల గురించి ఉన్నాయి.  ఎక్కడా ‘శవ పురాణం‘  గురించి లేదు. ఎక్కడా లేని దీన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చాడనేది దర్శకుడికే తెలియాలి. క్రియేటివిటి ఫ్రీడమ్ అనుకోని ఒదిలేయాలేమో. మరోవైపు సమాధి శిక్ష అంటూ కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు. ఊరి వాళ్లను క్షోభ పెట్టిన వాడిని నిలువునా పాతి పెట్టి ఆ శవంపై కోడి నెత్తురుతో అభిషేకం చేసి నువ్వులతో పాటు ఆ ఊరి వాళ్ల పాదదూళితో పాటు ఓ బట్టలో చుట్టి అతన్ని సమాధి శిక్ష విధిస్తారు.

అయితే.. అనుకోని సందర్బంలో ఆ ఊర్లో పంతులుతో పాటు మరొక ఊరి రాజకీయ నాయకుడు అతని సమాధి దగ్గరకు వచ్చి లఘు శంఖ (టాయిలెట్)తీర్చుకుంటారు. ఈ క్రమంలో వారి కాళ్లకు ముళ్లో.. గాజు పెంకనో గుచ్చుకోవడం ఆ రక్తం సమాధిపై పడటంతో తిరుపతి ఆత్మ వీళ్లలో ప్రవేశించి ఈ దారుణాలు చేస్తాడు.మరోవైపు సమాధి, ఆత్మ సంగతి తేలుద్దామని వచ్చిన ఏసీపీని తిరుపతి ఆత్మ చంపేస్తోంది. ఆ తర్వాత ఎక్కడో కాశీలో ఉన్న రాధ అక్క భైరవి అక్కడి వచ్చి దీనికి పరిష్కారం చెబుతుంది. మొత్తంగా అఖండ, అరుంధతి సినిమాలను మిక్సీలో వేసి కాస్త అటు ఇటు మార్చి ‘ఓదెల 2’ ను తెరకెక్కించారు. మధ్యలో ఆత్మ ఓ రిపోర్టర్ కు సంబంధించిన డ్రోన్ తిరుపతి సమాధిపై పడిపోవడంతో అతని సాయంతో తంత్ర విద్యలు నేర్చుకొని మరింత బలవంతు అవ్వడం వంటివి లాజిక్ కు అందవు. పైగా దేవుడి గుడిలో రావడానికి ఆత్మలు భయపడతాయని ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో చూపించిందే. కానీ ఈ సినిమాలోని ఆత్మ అన్ని చోట్లా యదేచ్చగా వచ్చేస్తోంది. క్లైమాక్స్ ను ఇంకాస్త బెటర్ గా తీసుంటే సినిమా మరో లెవల్లో ఉండేది. సినిమాను లాజిక్ ను పక్కనపెట్టి చూస్తే బీ,సీ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అక్కడ దర్శకుడు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. సినిమాకు అశనీష్ లోక్ నాథ్ అందించిన ఆర్ఆర్ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది. గ్రాఫిక్స్ బాగున్నాయి.సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటల విషయానికొస్తే..
తమన్నా అంటే ఇప్పటి వరకు గ్లామర్ డాల్ గానే చూసారు. మధ్యలో బాహుబలిలో చేత కత్తి పెట్టింది. ఓదెల 2లో నాగ సాధువు పాత్రలో ఉన్నంతలో మెప్పించింది. ఈ సినిమాలో తిరుపతిగా నటించిన వశిష్ఠ సింహా తన నటనతో భయపెట్టాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

అజనీస్ లోకనాథ్ రీ రికార్డింగ్

నటీనటుల నటన

గ్రాఫిక్స్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ ల్యాగ్

లాజిక్ లేని సీన్స్

పంచ్ లైన్..  ఓ మోస్తరుగా భయపెట్టే ‘ఓదెల 2’..

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News