Tamannaah vs Vijaysanthi: సాధారణ ప్రతి శుక్రవారం కూడా కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఆ సినిమాల భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆ రోజే తెలుస్తూ ఉంటుంది.. అలా ఈనెల 18వ తేదీన పలు రకాల సినిమాలు టాలీవుడ్ నుంచి రిలీజ్ కాబోతున్నాయి. అలా ఏప్రిల్ 18 తమన్నా నటిస్తున్న ఓదెల -2..కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లి కొడుకు గా నటిస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం డియర్ ఉమా విడుదల కానున్నాయి.. డియర్ ఉమా చిత్రంలో సుమయా రెడ్డి నటించింది. ఈ చిత్రాలన్నీ కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల లాగా హీరోయిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి.
ముందుగా గతంలో విడుదలైన ఓదెల చిత్రంకి.. సీక్వెల్ గా ఓదెల 2 తీశారు డైరెక్టర్ అశోక్ తేజ.. ఇందులో హెబ్బా పటేల్ కూడా నటిస్తోంది. మరొక నటుడు వశిష్ట ఎన్ సింహ కీలకమైన పాత్రలో నటిస్తున్నప్పటికీ.. హీరోయిన్ తమన్నా మాత్రమే ఓదెల 2కి కీలకంగా మారిపోయింది. కాబట్టి ఇది పక్క లేడీ ఓరియంటెడ్ చిత్రంగానే ఏప్రిల్ 18వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తమన్నా కారెక్టర్ అరుంధతిలో అనుష్క రేంజ్ లో ఉంటుందని స్టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా కానీ విజయం సాధిస్తే తమన్నా కూడా ఒకప్పటి అనుష్క అంత స్థాయికి ఎదగడం ఖాయమని ఇప్పటికే సినీవర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
ఇక మరొక చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి... సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు.. కళ్యాణ్ రామ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది విజయశాంతి. అయితే ఈసారి కర్తవ్యం రేంజ్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసినట్లు.. ఇప్పటికే శ్రీ మా ప్రమోషన్ చూచి ఎన్నో రకాల హింట్స్ వచ్చేసాయి. ఇక దాంతో.. ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. కళ్యాణ్ రామ్ హీరోయిన్ అయినప్పటికీ విజయశాంతికి కూడా ఈ చిత్రంలో పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండేటట్టు స్పష్టమవుతోంది.
ఇక మరొకవైపు డియర్ ఉమా చిత్రం కూడా ఏప్రిల్ 18న విడుదల కాబోతోంది. సుమయా రెడ్డి లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమా కోసం యంగ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇలా వేటికవే ప్రత్యేకతలు చాటుకుంటూ.. ఒకేరోజు అనగా ఏప్రిల్ 18 న 3 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి మరి ఈ చిత్రాలలో ఏవి విజయం సాధిస్తాయో చూడాలి. ముఖ్యంగా తమన్నా, విజయశాంతి, సుమయా రెడ్డిలో ఎవరు విజయపతాకం ఎగరవేస్తారు అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. అసలే హీరోయిన్స్ కేవలం పాటలకే అన్నట్టు మారుతున్నాయి తెలుగు సినిమాలు. ఈ క్రమంలో ఇలా ఒకేరోజు మూడు హీరోయిన్ ఓరియంటడ్ సినిమాలు వస్తూ ఉండడంతో .. ప్రేక్షకుల్లో కూడా కుతూహలం మొదలయ్యింది. మరి ఈ ఫ్రెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కాసుల వర్షం కురిపిస్తుందో తెలియాలి అంటే ఈ 18 వరకు వేచి చూడాల్సిందే.
Also Read: SBI: రుణగ్రహీతలకు ఎస్బిఐ భారీ శుభవార్త..తగ్గనున్న హోంలోన్ వడ్డీ రేట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









