Tamannaah breakup:
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చే 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజీతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి.కానీ స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తోంది.
అందులో భాగంగానే ఇప్పుడు మరికొన్ని చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఓదెలా 2 సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అఘోరీగా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లకు పైగానే అవుతున్నా ఇప్పటికీ పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో అభిమానులు తమన్నా పెళ్లిపై పలు రకాల వార్తలు క్రియేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు తమన్న హిందీలో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ చేసినప్పుడు ఆ వెబ్ సీరీస్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడింది.ఈ విషయాన్ని నేరుగా చెప్పేసింది. అతడితో కలిసి వెకేషన్స్ కి వెళ్ళింది. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ వచ్చిన ఈమె త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోందని అందరూ అనుకున్నారు.
కానీ అనూహ్యంగా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు అందుకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఆధారంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విజయవర్మకు సంబంధించిన ఫోటోలన్నింటిని డిలీట్ చేసింది తమన్నా. ఇద్దరు విడిపోయారని స్పష్టం అవుతుంది.
ఇదిలా ఉండగా బ్రేకప్ తర్వాత తొలిసారి ఎయిర్పోర్టులో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. బ్రేకప్ జరగకముందు ఆమె ముఖంలో ఉండే సంతోషం బ్రేకప్ అయిన తర్వాత కనిపించడం లేదు. పూర్తిగా దుఃఖంతో నిండిపోయింది. ఇది చూసిన అభిమానులంతా కూడా ఇక బ్రేకప్ అయిపోయిందని ఫిక్స్ అవుతున్నారు.
మొత్తానికి అయితే తమన్నా ముఖం చూసి అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ కి ఇలాంటి ఇబ్బందులా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇక అంతే కాదు తమన్నా ఈ సంఘటన నుంచి త్వరగా కోలుకోవాలని కూడా కామెంట్లు చేస్తున్నారు.
Also read: EPFO Services In ATM: ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త.. భవిష్యత్‌లో ఏటీఎం నుంచి సేవలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్- https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









