Tamannah Bhatia Video: బ్రేకప్ రూమర్స్ వేళ బిగ్ ట్విస్ట్.. మళ్లీ కలిసి పోయిన తమన్న, విజయ్ వర్మ..!.. వీడియో వైరల్..

Tamanna and Vijay Varma: తమన్న, విజయ్ వర్మలు ఇద్దరు విడిపోయారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరు అఫిషియల్ గా చెప్పకపోయిన చోటు చేసుకున్న కొన్ని ఘటలు ఈ రూమర్స్ కు బలం చేకూర్చేవిగా మారాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట రచ్చ చేస్తుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 7, 2025, 04:45 PM IST
  • మళ్లీ ఒక్కటైన తమన్న, విజయ్ వర్మ..
  • నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
Tamannah Bhatia Video: బ్రేకప్ రూమర్స్ వేళ బిగ్ ట్విస్ట్.. మళ్లీ కలిసి పోయిన తమన్న, విజయ్ వర్మ..!.. వీడియో వైరల్..

Tamannaah Vijay varma video viral: బాలీవుడ్ ఎవర్ గ్రీన్ జంట మిల్కీ బ్యూటీ తమన్న, విజయ్ వర్మలు కొన్నేళ్లుగా ఒకర్ని మరోకరు ప్రేమలో ఉన్నారు.  అయితే.. ఏమైందో కానీ.. ఇటీవల సోషల్ మీడియాలో ఇద్దరు కూడా ఒకర్ని మరోకరు అన్ ఫాలోచేసుకున్నారు. అంతే కాకుండా.. ఏ ప్రొగ్రామ్ జరిగిన.. ఎక్కడ టూర్లకు వెళ్లిన జంటలుగా  వెళ్లి అక్కడ సందడి చేసేవారు. అలాంటిది రవీనా టాండాన్ ఇంట్లో జరిగిన హోలీ వేడుకల్లో తమన్న, విజయ్ వర్మలు ఎవరికి వారు ప్రత్యేంగా వెళ్లి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో వీరు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు రచ్చ చేశాయి. ఇక తమన్న మాట్లాడుతూ.. ప్రేమను బిజినెస్ కోణంలో చూడొద్దని సెటైర్ లు వేసింది. ప్రేమించిన వాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వాలని కూడా చెప్పింది. మరోవైపు విజయ్ వర్మ.. ప్రేమను ఐస్ క్రీమ్ లో ఎంజాయ్ చేయాలని కూడా చెప్పాడు. దీంతో ఇద్దరు కూడా ఒకర్ని మరోకరు ఇన్ డైరెక్ట్ గా సెటైర్ లు వేసుకున్నారు.ఈ క్రమంలో ఇటీవల తమన్న భాటియా.. తన ఇంట్లో పూజలు కూడా చేశారు.  ఆ తర్వాత డ్యాన్స్ లు చేస్తు కూడా రచ్చ చేశారు.

 

మొత్తంగా తమన్న, విజయ్ వర్మలు బ్రేకప్ పక్కా.. అంటూ సోషల్ మీడియా కోడైకూస్తుంది.ఈ క్రమంలో అభిమానులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చే విధంగా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిలో విజయ్ వర్మ, తమన్నలు ఇద్దరు ఒకరి పక్కన మరోకరు ఎంతో క్లోజ్ గా చేయ్యిపెట్టుకుని, చెట్టాపట్టాల్ వేసుకుని ఉన్నారు. తమన్న కారులు ఎక్కితే.. విజయ్ డోర్ తీశాడు. అదే విధంగా తమన్న.. డ్రెస్ బైటకు ఉంటే.. లోపలికి సర్దాడు. ఇద్దరు ఒకరితో మరోకరు నవ్వుతూ ఫుల్ రోమాంటిక్ మూడ్ లో ఉన్నారు.

Read more: Alekhya Chitti Marriage: ఆ తిట్టిన వ్యక్తిని మీలో ఒకరు పెళ్లి చేసుకొవాలి.. అలేఖ్య రచ్చలో తెరపైకి సరికొత్త డిమాండ్..!

ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే.. ఈ వీడియోను చూసిన అభిమానులు ఒక్కసారిగా తమన్న, విజయ్ లు కలిసి పొయారని షాక్ అయ్యారు.  ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ వీడియో గతంలో తమన్న, విజయ్ లు కలిసి ఉన్నప్పటి వీడియో. అయితే.. వీరు విడిపోయారని రూమర్స్ వేళ కొంత మంది అభిమానులు దీన్ని మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా చేశారు. దీంతో వీళ్లిద్దరి బ్రేకప్  అంశం ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News