Vijay sethupathi on hero nagarjuna: హీరో నాగార్జున ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో హోస్ట్ గా చేస్తునే మూవీస్ లలో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో నాగార్జునపై తమిళ హీరో విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి తనకు నాగార్జున అంటే చాలా అభిమానమని, ఆయన మూవీస్ అస్సలు మిస్ కాకుండా చూస్తు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాగార్జునలో ఎలాంటి మార్పులు కన్పించడంలేదన్నారు.
ఇప్పటికి కూడా చాలా యంగ్ గా కన్పిస్తున్నారన్నారు. తన మనవళ్లు కూడా పెద్దవారిలా మారిపోయారని కానీ నాగార్జునలో ఏ మాత్రంమార్పు రాలేదన్నారు. అసలు ఆయనకు వయసు ఎందుకు పెరగడం లేదో తనకు అర్థం కావట్లేదని ఫన్నీగా మాట్లాడారు.
జియో హాట్‌స్టార్ నిర్వహించిన ‘సౌత్ అన్‌బాండ్’ కార్యక్రమంలో ఈ విధంగా నవ్వుతూ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నాగార్జున, మోహన్‌లాల్‌తో కలిసి విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ క్రమంలో నాగార్జున గురించి విజయ్ సేతుపతి ఈ విధంగా మాట్లాడారు. అంతటితోఆగకుండా.. యాంటీ ఏజింగ్‌పై పరిశోధనలు చేసేవాళ్లు నాగార్జునపై టెస్టులు చేయాలని కూడా సరదాగా మాట్లాడారు.
Read more: Shriya Saran Video: కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియా.. వీడియో వైరల్..
ఆయన హెయిర్ నెరవలేదని, ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు విజయ్ సేతుపతి తమిళ బిగ్ బాస్ సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









