Director Love Propose Video: స్టేజీపైన లవర్ కు ప్రపొజ్ చేసిన యంగ్ డైరెక్టర్.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..

Family Director in Tourist Event:  తమిళ యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఇటీవల తన ప్రియురాలికి అందరిముందు ప్రపోజ్ చేశాడు. దీంతో ఆయన లవర్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2025, 09:16 AM IST
  • ప్రియురాలికి లవ్ ప్రొపజల్..
  • వైరల్ గా మారిన వీడియో.
Director Love Propose Video: స్టేజీపైన లవర్ కు ప్రపొజ్ చేసిన యంగ్ డైరెక్టర్.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..

Tamil young Director Abishan Jeevinth Proposed his girlfriend video: తమిళ డైరెక్టర్ అభిషన్ జీవంత్ తన డైరెక్ట్  లో వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ఈవెంట్ లో  పాల్గొన్నారు. ఈ క్రమంలో మూవీ గురించి అనేక ఆసక్తి కర అంశాలు అభిమానులతో పంచుకున్నారు. కోలీవుడ్‌లో వస్తున్న కామెడీ-కుటుంబ చిత్రాలలో టూరిస్ట్ ఫ్యామిలీకి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీకి.. అభిషన్ జీవింద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆయన కెరియర్ లో ఫస్ట్ ది కావడంతో ఆయన ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.  ఈ మూవీలో. శశికుమార్ కుటుంబ పెద్దగా నటించగా, సిమ్రాన్ ఆయనకు జోడీగా నటిస్తోంది.

Add Zee News as a Preferred Source

గుడ్ నైట్ , లవర్ వంటి చిన్న బడ్జెట్ హిట్ చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్ సంస్థ టూరిస్ట్ ఫ్యామిలీని కూడా నిర్మించింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఇందులో, ఆ చిత్ర దర్శకుడు అభిషన్ జీవంత్ తన ప్రియురాలికి  ప్రపోజ్  చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అభిషన్ జీవంత్, అఖిల ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

 

అంతే కాకుండా.. పెళ్లికి కూడా ఇరుకుటుంబాలు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో  అభిషన్.. అఖిలను స్టేజీ మీద ప్రపోజ్ చేశారు.  దీంతో ఆయన ప్రియురాలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఎమోషన్ అయ్యింది.

 అభిషన్ లు, అఖిల ఇద్దరు కూడా.. 6వ తరగతి చదుకుంటున్నప్పటి నుంచి ఒకరికి మరోకరు తెలుసంట. అప్పటి నుంచి  వీరి మధ్య ప్రేమ కంటీన్యూ అవుతు వచ్చింది. దీంతో వీరిద్దరు అక్టోబర్ లో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Read more: Sobhita Dhulipala: చైతు కొంప ముంచిన శోభిత..!.. నోట్లో సిగరెట్, చేతిలో గన్‌తో రచ్చ.. నెట్టింట మళ్లీ దుమారం..

ఇక కథ విషయానికి వస్తే.. కరోనా కాలంలో.. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలీపోయింది. ఆ సమయంలో.. తమిళ కుటుంబం జీవనోపాధి, ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీలో... మే 1న అభిమానుల ముందుకు రానుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News