)
TBD OTT: కేవలం రూ 10 రూపాయలకి మంత్లీ సబ్ స్క్రిప్షన్ రుసుముతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో సంచలనం రేపుడానికి రెడీ అవుతోంది దుబాయ్ దేశానికి చెందిన రాయల్ ర్యాప్చీ వారి ‘టి.బి.డి’ఓటీటీ ఇండియా. రాయల్ ర్యాప్చీ ప్రారంభించిన టిబిడి డిజిటల్ ఓటీటీ లో సరికొత్త విప్లనానికి నాంది పలకనున్నట్టు తెలుస్తుంది. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచ ఎంటర్టైన్మెంట్ రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా సినిమా రంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంటర్టైన్మెంట్ సిల్వర్ స్క్రీన్ నుంచి స్మాల్ స్క్రీన్ వరకు అక్కడ నుంచి మొబైల్ ఫోన్ లకు పాకింది. దీంతో అంతర్జాతీయంగా.. దేశీయంగా అనేక ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఆడియన్స్ ను అలరించడానికి అనేక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను అందిస్తోంది.
ఈ రూట్లోనే తాజాగా భారతీయ ఓటీటీ రంగంలో సరికత్త విప్లవానికి ‘టీబీడీ’ (త్రిభాణధారి) ఓటీటీ ద్వారా అడుగుపెట్టింది దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ. ఈ సంస్థ రీసెంట్ గా దుబాయ్‌లో ఘనంగా లాంచ్ అయిన ‘టీబీడీ’ ఓటీటీ ఇప్పుడు భారతదేశంలో గ్రామ గ్రామానికి విస్తరించటానికి ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో లోగో లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి సంస్థ ఫౌండర్, ఎండీ ధరమ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీ, సౌత్ ఇండియా సీఈఓలు ప్రముఖ నటులు, నిర్మాత డి.యస్.రావు, ప్రముఖ దర్శకుడు వి. సముద్రలతో పాటు దర్శకులు వి.యన్. ఆదిత్య, చంద్రమహేష్, ఇ. సత్తిబాబు, శివనాగు, డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి, ‘సంతోషం’ సురేష్ కొండేటి, నటుడు దాసన్నలతో పాటు పలువురు నిర్మాతలు, చిత్ర ప్రముఖులు ఈ ఓటీటీ లాంఛ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ గారి చేతులు మీదుగా ఈ యాప్ లాంచ్ ను చేశారు.
ఈ సందర్భంగా టిబిడి ఫౌండర్, ఎండీ ధరమ్‌గుప్తా మాట్లాడుతూ...
టిబిడి అనేది మన దేశంలో మారుమూల గ్రామాలకు విస్తరించాలనేది మా ఆకాంక్ష. ఇందులో మన దేశీ కంటెంట్ మాత్రమే ఉంటుంది. అందులోనూ కుటుంబం అంతా కూర్చుని చూసే వల్గారిటీలేని కంటెంట్ మాత్రమే ఉంటుందని చెప్పారు. సెక్స్ కంటెంట్ తప్ప అన్నీ ఉంటాయన్నారు. మన దేశంలోని అన్ని భాషల సినిమాలు, అవి ఎంత పాతవైనా, కొత్తవైనా తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ కావొచ్చని చెప్పుకొచ్చారు. ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కేవలం 10 రూపాయలు మాత్రమే అని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అది కూడా ఎలాంటి వల్గారిటీ లేని కంటెంట్ ను ప్రేక్షకులకు చేరువ చేయడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పుకొచ్చారు.
ఓటీటీ రంగంలో ఇప్పటికే చాలా ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నప్పటికీ ఇంకా చాలా స్పేస్ ఉంది. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించగలిగితే గట్టిగా నిలబడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మేం మంచి కంటెంట్‌ను మాత్రమే నమ్ముకుని వస్తున్నాము. చిన్న నిర్మాతలకు ఇక్కడ పెద్ద పీఠ వేస్తాం. పేమెంట్ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉంటామన్నారు.
టిబిడి సౌత్ సీఈఓల్లో ఒకరైన డి.యస్. రావు మాట్లాడుతూ...
30 ఏళ్లుగా ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఎన్నో తీపి, చేదు అనుభవాలను చూశాను. ఓటీటీ బిజినెస్ విషయంలో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓటీటీకి సినిమా అమ్ముదామనుకుంటే వారికి ఎవరిని కలవాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియడం లేదున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ టిబిడి ఓటీటీ రావడం, దీనికి నేను సముద్రగారు బాధ్యులుగా ఉండటం గొప్పగా ఫీలవుతున్నామన్నారు. ఇది చిన్న సినిమాలకు పెద్ద ఊతం ఈ ఓటీటీ సబ్ స్రిప్షన్.
ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్రతో పాటు నిర్మాత కే.కే.రాధా మోహన్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.