Uruku Patela Songs: ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన ఉలవచారు బిర్యాని అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో తేజస్ కంచెర్ల. ఆ తర్వాత కేటుగాడు, ఆర్డిఎక్స్ లవ్ వంటి సినిమాలలో కనిపించిన తేజస్ ఈ మధ్యనే హుషారు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఇప్పుడు తేజస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఉరుకు పటేలా. తాజాగా ఈ సినిమా నుంచి ఓరి మాయలోడా అనే ఒక ఆసక్తికరమైన పాటను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. స్టార్ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా విడుదల అయిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.  


లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హుషారు సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన తేజస్ ఉరుకు పటేలా సినిమాతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చిత్ర బృందం ఆశిస్తోంది. గెట్ ఉరికిఫైడ్ అని ఒక ఆసక్తికరమైన టాగ్ లైన్ కూడా సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. 


ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజర్, ప‌ట్నం పిల్లా పాటకి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఓరి మాయలోడా అనేది హీరో ప్రేమ‌లో ప‌డిన హీరోయిన్ త‌న ప్రేమ‌ను తెలియ‌జేస్తూ పాడే పాట. స్ఫూర్తి జితేంద‌ర్ పాడిన ఈ పాటను శ్రీనివాస మౌళి రాశారు.


Also Read: పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..


Also Read: ఏపీలో ఘోర విషాదం.. 18కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter