Vishnupriya Arrest: విష్ణుప్రియ అరెస్ట్ తప్పదా, బెట్టింగ్ యాప్ కేసులో ఫోన్ సీజ్

Vishnupriya Arrest: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. యాంకర్ విష్ణుప్రియ ఇవాళ పోలీసుల విచారణకు హాజరైంది. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2025, 02:30 PM IST
Vishnupriya Arrest: విష్ణుప్రియ అరెస్ట్ తప్పదా, బెట్టింగ్ యాప్ కేసులో ఫోన్ సీజ్

Vishnupriya Arrest: బెట్టింగ్ యాప్స్‌పై కొరడా ఝులిపిస్తున్నహైదరాబాద్ పోలీసులు వీటిని ప్రమోట్ చేస్తున్న సెలెబ్రిటీలను టార్గెట్ చేశారు. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, సన్నీలకు విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేయగా ఇవాళ విష్ణుప్రియ విచారణ ముగిసింది. 

Add Zee News as a Preferred Source

పంజాగుట్ట పోలిస్ స్టేషన్‌కు విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియను పోలీసులు చాలా అంశాలపై ప్రశ్నించారు. ఈ విచారణలో కీలకాంశాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. దాదాపు 4-5 గంటలు విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సుదీర్ఘంగా వివరాలు సేకరించారు. అనంతరం ఆమె ఫోన్ సీజ్ చేశారు. విష్ణుప్రియకు బెట్టింగ్ యాప్స్‌తో ఉన్న లావాదేవీలు, ఫోన్ కాల్స్ వంటి అంశాలపై లోతుగా విచారించేందుకు వీలుగా ఆమె ఫోన్ సీజ్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఆమెను అదుపులో తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసినవారికి విచారణకు నోటీసులు జారీ చేయడమ కాకుండా హాజరయ్యేందుకు కోరిన సమయం ఇస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణకు హాజరుకాకుంటే మాత్రం అరెస్టు చేస్తామని చెప్పారు. ఇవాళ జరిగిన విచారణకు విష్ణుప్రియ తన అడ్వకేట్‌తో కలిసి హాజరైంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని విచారించారు. మరో 8 మందిని విచారించాల్సి ఉంది. ప్రమోషన్ల వెనుక ఎవరున్నారు, డబ్బులు ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారనే వివరాలు సేకరిస్తున్నారు. 

Also read: High Court Serious On Hydra: దమ్ముంటే పెద్దల జోలికి వెళ్లి చెప్పండి, హైడ్రాపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News