Telangana Cinema: తెలుగు సినిమా పుట్టి తొమ్మిది దశాబ్ధాలు కావొస్తోంది. ఎంతో మంది కళాకారులు… ఆళ్ల ప్రతిభ చూపెట్టారు. నటీనటులు సిల్వర్ స్రీన్ పై మెరిస్తే,దర్శకులు ఇతర టెక్నిషియన్స్ తెర కష్టపడతారు. ఇన్నేళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో తెలంగాణాకు చెందిన టెక్నిషియన్స్ తక్కువనే చెప్పాలి. అయితే ఈ మధ్య తెలంగాణ ప్రాంతం నుండి కొత్త నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నిషియన్స్ బయటకొస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పెళ్లి చూపులు సినిమాతో తరుణ్ భాస్కర్ తెలుగులో సత్తా చాటారు. ఈ సినిమా 2016లో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది. తెలంగాణ నుంచి టాలీవుడ్ లో సత్తా చాటిన హీరోల్లో కాంతారావు ఒకరు. అటు క్యారెక్టర్ ఆర్టీస్ట్ గా, విలన్ గా మెప్పించిన వాళ్లలో ప్రభాకర్ రెడ్డి. అలాగే కమెడియన్ గా నవ్వించిన బాబు మోహన్, వేణుమాధవ్, లేటేస్ట్ గా యూత్ ను అట్రాక్ట్ చేస్తోన్న నితిన్, విజయ్ దేవరకొండ ఈ గడ్డపై నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.
ఇక ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అలా తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో సత్తా చాటిన వాళ్లలో పైడి జై రాజ్ ఒకరు. కతెలంగాణలోని కరీంనగర్ లో పుట్టిన జైరాజ్...బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని దున్నేసారు. అక్కడ సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. 1990లలో అక్కినేని నాగేశ్వర్రావు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు అందుకుంటే....అంతకు పది యేళ్ల మునుపు 1980 ఈయన అత్యున్నత అవార్డు అందుకున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పైడి జైరాజ్ పేరిట జాతీయ అవార్డును ఇవ్వడం ప్రారంభించింది.
సినిమా అనే ఓడను నడిపించే కెప్టెన్ దర్శకుడు ...ఇక తెలుగు సినిమాల్లో తెలంగాణ దర్శకుల వాటా కూడా ఉంది. శ్యామ్ బెనగళ్ ఈ పేరు వినని భారతీయ సినీ ప్రేమికుడు ఉండడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరెక్కించారు. ఈయన టాలెంట్ కు పద్మశ్రీ వరించింది.చలన చిత్ర రంగంలనే పేరు మోసిన దాదా సాహేబ్ పాల్కే అవార్డును అందున్న ఘనాపాటి బెనగళ్.
ఆపై తెలంగాణ సినిమా దునియా అంత గుర్తించేటట్టు చేసిన దర్శకుడు బి.నరసింగ్ రావు. మెదక్ జిల్లాల పుట్టిన ఈ డైరెక్టర్..దాసి,మట్టి మనుషులు,మా భూమి అసోంటి ఎన్నో అద్భుత కళాఖండాలు తెరకెక్కించి తెలంగాణ పరిస్థితులను కళ్లకు కట్టారు. దర్శకునిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, తన ప్రతిభను కనబరిచారు. అటు అల్లాణి శ్రీధర్ కూడా కొమరం భీమ్ సిన్మాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన గొండు వీరుడు కొమ్రం భీమ్ జీవిత కథను వాస్తవికంగా చూపించి ప్రసంసలు అందుకున్నారు.
ఈ జనరేషన్ విషయానికొస్తే.. సురేందర్ రెడ్డి,హరీష్ శంకర్,వంశీ పైడిపల్లి, దశరథ్, నాగ్ అశ్విన్ వంటి వాళ్లు కమర్శియల్ సక్సెస్ లు అందిస్తూ దూసుకుపోతున్నారు. అతనోక్కడే సినిమా తోన ఎంట్రీ ఇచ్చిన సురేందర్ రెడ్డి, కిక్, రెసుగుర్రం,దృవ, సైరా లాంటి సినిమాలతో దూసుకు పోతున్నారు. హరీష్ శంకర్ ప్లాపులల్ల ఉన్న పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంగి బ్లాక్ బస్టర్ అందించారు. తన దైన స్టైల్ తో పెద్ద డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు.
మున్నా సినిమాతో డైరెక్టరైన వంశీ పైడిపల్లి ..నిర్మల్ జిల్లా ఖానాపూర్ ల పుట్టారు. .ఎన్ టి ఆర్ తోని బృందావనం లాంటి క్లాస్ సినిమా తెరకెక్కించారు. ఆ తర్వాత ఎవడు,ఊపిరి, మహర్షి, వారసుడు లాంటి డిఫరెంట్ సబ్జేక్ట్ లతోని డైరెక్టర్ గా తన సత్తా చూపించాడు.
వీళ్లందరికన్నా ముందే.. డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకున్నాడు ధశరథ్..నాగార్జున తోని 2002 ల సంతోషం చిత్రంతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
అటు కృష్ణ హీరోగా వచ్చిన ఎన్ కౌంటర్ సిన్మాతో డైరెక్టర్ అయ్యాడు ఎన్ .శంకర్. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా ఈయన తెరకెక్కించిన శ్రీరాములయ్య సినిమాతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత భద్రాచలం,జై బోలో తెలంగాణ వంటి సినిమాలతో సత్తా చాటారు. అలాగే ‘ఏమైంది ఈ వేళ’ చిత్రతో మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది రామ్ చరణ్ తోని రచ్చ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రవితేజను బెంగాల్ టైగర్ గా చూపిస్తే .. గోపిచంద్ ను గౌతమ్ నందాగా చూపెట్టాడు.
అటు తెలంగాణ నుంచి డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు హనురాఘవ పూడి. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, సీతారామం సినిమాలతో అలరించిన ఈయన ప్రభాస్ తో ‘ఫౌజీ’ వంటి పీరియాడిక్ మూవీ తెరకెక్కించబోతున్నాడు. ‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమాతో సాగర్ చంద్ర విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత పవన్, రానాలతో ‘భీమ్లా నాయక్’ తెరకెక్కించాడు. అటు ‘ఘాజీ’ సినిమాతో అట్రాక్ట్ జేసిన సంకల్ప రెడ్డి బాలీవుడ్ లో సత్తాచాటాడు. సంకల్ప్ రేడ్డి. పూర్తిగా సబ్ మేరిన్ ల నడిచే గీ సిన్మా తోని గీయన క్రియేటర్ గా గుర్తింపు తెచ్చుకుండు
అటు సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డితో సత్తా చాటిన ఈయన బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’, యానిమల్’ చిత్రాలతో సత్తా చాటాడు. త్వరలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాతో పలకరించబోతున్నాడు. నాగ్ అశ్విన్.. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, కల్కి వంటి సినిమాలతో తెలుగు సినిమాల్లో కాదు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. వేణు శ్రీరామ్, ప్రేమ్ రాజ్, నందిని రెడ్డి, వేణు ఊడుగుల, క్రాంతి మాధవ్, వెంకీ కుడుమలు, అనుదీప్, సానా యాది రెడ్డి, టి. ప్రభాకర్, మధుర శ్రీధర్ రెడ్డి వంటి వారు తెలుగు సినిమిాల్లో సత్తా చాటారు.ఇలా తెలుగు సినిమాల్లో తెలంగాణ దర్శకులకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









