Akhanda 2: అఖండ2 కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. సంబరాల్లో బాలయ్య అభిమానులు..

Telangana high court on  Akhanda 2: అఖండ 2 కు ఎట్టకేలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికినట్లైంది. మొత్తంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టేను విధించింది. దీంతో మూవీ టీమ్ కు ఈ అంశం భారీ ఊరటనిచ్చిందని చెప్పుకొవచ్చు.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 12, 2025, 02:46 PM IST
  • అఖండ 2 కు తెలంగాణలో ఊరట..
  • కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం..
Akhanda 2: అఖండ2 కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. సంబరాల్లో బాలయ్య అభిమానులు..

Telangana high court big relief to akhanda 2 thaandavam: నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ 2 తాండవం ప్రస్తుతం విడుదలై వరల్డ్ వైడ్ గా మాస్ జాతర మొదలైంది. నిన్న ప్రీమియర్ షోలకు కూడా భారీగా అభిమానులు తరలివచ్చారు. వరల్డ్ వైడ్ గా భారీగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. స్క్రీన్ మీద బాలయ్యను చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. థియేటర్ లోపల,  బైట  జై బాలయ్య అంటూ అభిమానులు రచ్చ రంబోలా చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఇదిలా ఉండగా.. బాలయ్య అఖండ 2 విడుదల నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక లాయర్ టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టికెట్ పెంపు జీవోను రద్దుచేసింది. అయితే.. దీనిపై తాజాగా.. మూవీ టీమ్  డివిజన్ బెంచ్  కు అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉతర్వులపై స్టే విధించింది.

దీంతో  అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థకు కోర్టు ఆదేశాలతో బిగ్ రిలీఫ్ లభించినట్లైంది. అదే విధంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై.. 14వ తేదీ వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్,  తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అఖండ 2 మూవీ టీమ్, బాలయ్య అభిమానులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు.

Read more: Akhanda 2 Review:‘అఖండ 2 ’రివ్యూ.. బాలయ్య శివ ‘తాండవమే’..

మరోవైపు నిన్న అఖండ 2 టికెట్ల పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.  దీనిలో సినిమా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో’పై తెలంగాణ హైకోర్టు సీరియస్ స్పందించింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడంపై కీలక వ్యాఖ్యలు చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News