Tollywood: ఏపీ ప్రభుత్వానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కృతజ్ఞతలు..

Tollywood: విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్  గవర్నమెంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 23, 2025, 12:45 AM IST
Tollywood: ఏపీ ప్రభుత్వానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కృతజ్ఞతలు..

Telugu Film Chamber of Chamber of commerce: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ఏపీ గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఈ సందర్భంగా  గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, పర్యాటక సాంస్కృతీ, సినిమాటోగ్రఫీ మంత్రి  కందుల దుర్గేష్ తో పాటు..  మేనేజింగ్ డైరెక్టర్ కి, ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ లకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రత్యేక  కృతజ్ఞతలు తెలియచేసింది.

Add Zee News as a Preferred Source

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తెస్తూ ఏపీలో స్టూడియోల నిర్మాణం, ఫిలిం ఇండస్ట్రీ కి సంబందించిన వారికి గృహ నిర్మాణం కోసం భూమి కేటాయింపులు వంటి ప్రతిపాదనలను తెలియచేసామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా పూర్తి సహాయ సహకారాలు  ఉంటుందని తెలియచేసారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విషయంలో చూపుతున్న చొరవను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతేకాదు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాల్లో  త్వరితగతిన తగిన చర్యలను తీసుకోవాలని కోరారు. తద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి  ముందుకొచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామన్నారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News