AP Film Development: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ నారా లోకేష్, పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గార్లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలియజేసింది.
తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రణాళికలు మొదలు పెట్టినట్టుగా ఈరోజు విడుదల చేసిన లేకపోతే లేఖలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు రాసారు.
తెలుగు సినిమా పరిశ్రమకు మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టాలని నిర్మాతల మండలి సూచించింది. ముఖ్యంగా వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరంలో స్టూడియోలు నిర్మించడం, అవసరమైన మౌలిక వనరులు కల్పించడం వంటి ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది.
నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణుల అభివృద్ధి కోసం భూకేటాయింపు చేపట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గార్లకు సమర్పించారు.
నంది అవార్డులను పునరుద్ధరించి, పెండింగ్‌లో ఉన్న అవార్డులను అందజేయాలని కూడా నిర్మాతల మండలి అభ్యర్థించింది. సినీ కళాకారుల ప్రతిభను గౌరవించేందుకు ఇది ఉత్తమ మార్గమని వారు తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి నిర్మాతల మండలి సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి.
సినిమా రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాలు, ప్రోత్సాహక చర్యలు మరింత వేగంగా అమలు చేయాలని ఆశిస్తున్నాము అని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టనున్న ఈ కార్యక్రమాలు రంగానికి కొత్త ఊపునిస్తాయని ఆశిస్తున్నారు. పరిశ్రమకు అవసరమైన మౌలిక వనరులు అందించడంతో పాటు, కళాకారులు, సాంకేతిక నిపుణులు మరింత ప్రోత్సహించబడతారు ప్రొడ్యూసర్ ఫిలిం కౌన్సిల్..గౌరవ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ ఈ లేఖ ద్వారా తెలియజేశారు.
Also Read: Massive Encounter: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 22 మంది మావోయిస్టుల రక్తంతో తడిచిన దండకారణ్యం
Also Read: 100 KG Gold Seize: వంద కిలోల బంగారం సీజ్.. ఎందుకు? ఎంత విలువ తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









