Gaddar Awards:2024 యేడాదికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు, టెక్నిషియన్స్ కు సంబంధించి అవార్డులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. ఈ అవార్డులను తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖుల పేరు మీదున ఇవ్వనున్నారు. 1) NTR జాతీయ చలనచిత్ర అవార్డు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి పార్టీ పెట్టిన అతి కొద్ది సమయంలో సీఎం అయిన వ్యక్తిగా అన్నగారు రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. 2) అటు తెలంగాణ నుంచి వెళ్లి బాలీవుడ్ లో జెండా పాతిన తొలి తరం హీరో పైడి జై రాజ్. మన దేశంలో తొలి యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకొని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న పైడి జైరాజ్ పేరిట మరో చలనచిత్ర అవార్డు ను ఇవ్వనున్నారు. 3) అటు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కాదు.. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి తొలి దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న బి.ఎన్. రెడ్డి పేరిట మరో చలనచిత్ర అవార్డు ఇవ్వనున్నారు.
(4) విజయా సంస్థ పై ఎన్నో ఉత్తమ చిత్రాలను నిర్మించిన నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు కూడా ఇవ్వనున్నారు. (5) అటు కాంతారావు పేరిట చలనచిత్ర అవార్డు ఇవ్వనున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రెండు కళ్లు అయితే.. కాంతారావు తిలకం లాంటి వారు అని చెబుతారు. (6) తెలుగులో తొలి చిత్రం నిర్మించిన రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమకు సేవలు అందించిన వీళ్లకు “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (GTFA) ను ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సినిమాటోగ్రఫీ మంత్రిరీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు తెలంగాణ FDC చైర్మన్ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు) గారికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను పునరుద్ధరించడం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇది తెలంగాణలో చలనచిత్ర నిర్మాణాన్ని మరింతగా ప్రోత్సాహం ఇస్తుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









