Heroine Get Pregnancy: ప్రేమ.. పెళ్లి కాకుండానే సహజీవనం అనంతరం విడిపోవడం నేటి తరంలో సాధారణంగా మారింది. ఇక సంపన్న కుటుంబాల్లో అదొక అలవాటుగా మారింది. సినీ పరిశ్రమలోనూ అలాంటి సంస్కృతి సాధారణంగా మారింది. సినీ పరిశ్రమ అంటేనే కలల ప్రపంచం. ఆ కలల ప్రపంచంలో ప్రేమ.. పెళ్లికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఉన్నన్నాళ్లు సంతోషంగా ఉన్నామా? తర్వాత విడిపోయామా? అనే ధోరణి కనిపిస్తోంది. తాజాగా ఓ హీరో, హీరోయిన్ మధ్య కూడా ఇదే జరిగిందని తెలుస్తోంది. ప్రేమ.. పెళ్లి పేరుతో ఒక్కటైన హీరో, హీరోయిన్లు తర్వాత విడిపోయారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తీరా గర్భం దాల్చిన హీరోయిన్ పెళ్లి కోసం పట్టుబట్టగా ఓ స్టార్ హీరో వదిలించుకునేందుకు తీవ్రంగా కష్టపడ్డాడంట. తనతో సంబంధం లేదని చెప్పుకునేందుకు ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చుకున్నాడనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Movie release: బీజేపీ సపోర్ట్.. విడుదలకు మాత్రం నోచుకోని సినిమా.. ఎందుకంటే..?
ఓ హీరో కారణంగా ఓ హీరోయిన్ గర్భం దాల్చిందనే వార్త ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ హీరో తనతో నటించిన హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడంట. ఆ హీరోయిన్ కూడా హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ.. ప్రేమలో మునిగిపోయింది. ప్రేమ పేరుతో ఆ నటుడు హీరోయిన్ ఇంటికి వెళ్లడం .. ఆమె అతడి ఇంటికి వెళ్లడం అనేవి జరుగుతున్నాయి. కొన్నాళ్లు వీరిద్దరూ సహజీవనం కూడా చేశారంట. ఈ క్రమంలో శారీరకంగా ఒకటవగా.. కొన్నాళ్లకు ఆ హీరోయిన్ గర్భం దాల్చింది. దీంతో అందరూ ఆ హీరోయిన్‌ను హీరో పెళ్లి చేసుకుంటాడని భావించారు. అయితే ఆ హీరోకు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. దీంతో ఆమెతో రహాస్య బంధానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడంట. ఆ హీరోయిన్‌ను కడుపు తీయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ లో లోపించిన అక్కినేని హీరో లక్షణం.. కంప్లైంట్ చేసిన భార్య..!
హీరోయిన్ కడుపులో పెరుగుతున్న బిడ్డను తీసేయడానికి ఆ హీరో హీరోయిన్‌కి రూ.రెండు కోట్లు ఇవ్వజూపినట్లు సమాచారం. కలిసి ఎంజాయ్ చేశాం.. ఇప్పుడు పెళ్లంటే కుదరదు అనే ధోరణిలో హీరో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు వస్తే తమ కుటుంబం పరువుపోతుందని ఆ హీరో భయాందోళన చెందుతున్నాడట. ప్రస్తుతం హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదంట. హీరో ఆఫర్‌ను తీసుకుని హీరోయిన్ సైలెంట్ అవుతుందా? లేదంటే పెళ్లి కోసం.. తనకు జరిగిన అన్యాయం కోసం ఆ హీరోయిన్ ఏం చేస్తుందనే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమనేది తెలియదు. ఆ హీరో, హీరోయిన్ ఎవరనే విషయం కూడా వెలుగులోకి రాలేదు. కానీ సినీ పరిశ్రమలో మాత్రం ఈ వ్యవహారం జోరుగా చర్చ నడుస్తోంది. మరి ఈ విషయం బయటకు పొక్కుతుందా? లేదంటే పెద్దింటి వ్యవహారం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ముగుస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









