
TFJA: సమాజ సేవలో నిత్యం ఉరుకులు పరుగుల జీవనంలో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సమాజ క్షేమం కోసం నిరంతరం వార్తలను అందిస్తుంటారు. పోలీస్, డాక్టర్, ఇతర ఎమర్జన్సీ సర్వీసులాగా.. పండగ, పబ్బం అనేవి లేకుండా నిరంతం వార్తల కోసం పరుగులు పెడుతూనే ఉండాలి. అలాంటి జర్నలిస్టు ఫ్యామిలీల కోసం తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోషియేషన్స్ , శంకర్ ఐ హాస్పిటల్, ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ప్రియదర్శి తో పాటు యువ నిర్మాత నాగవంశీ ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ హెడ్ విశ్వమోహన్ ఛీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. హీరో కమ్ నటుడు ప్రియదర్శి, నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిక్ హెడ్ విశ్వమోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఘనంగా జరిగింది.
హెల్త్ క్యాంప్‌లో భాగంగా ప్రియదర్శి ఐ టెస్ట్ చేయించుకున్నారు. ఆయన చూపు పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని డాక్టర్లు వెల్లడించారు. హెల్త్ క్యాంప్ గురించి ప్రియదర్శి మాట్లాడుతూ... ''తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌కు రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉందన్నారు. ఈ క్యాంప్ నిర్వహిస్తున్న అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లి కి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న అసోసియేషన్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలన్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన 'ఐ స్క్రీనింగ్' హెల్త్ క్యాంప్‌లో జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe