TFPC : జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన దారుణ ఘటన దేశ ప్రజలను కలిచి వేసింది. ఈ దారుణ మారుణ కాండకు భారత ప్రభుత్వం పాకిస్థాన్ సరైన ప్రతీకారం తీర్చకోవాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. ఇప్పటికే పాపాల పాకిస్థాన్ అష్ట దిగ్బందనం చేసే దిశగా పలు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగా పాకిస్థాన్ తో ఉంటున్న సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్ట ప్రకటించింది. ఈ ఒప్పందం రద్దు వల్ల పాకిస్థాన్ మొత్తం ఎడారిగా మారడం ఖాయం. పక్క దేశంపై మారణ కాండకు ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న పాక్ ప్రభుత్వానికి ప్రభుత్వం సరైన రీతిలో గుణపాఠం అని చెప్పబోతుంది. కీలెరిగి వాత పెట్టబోతుంది.
ఇప్పటికే పహల్గామ్ దారుణ మారణ కాండను తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఖండించింది. తమ బాధను వ్యక్తం చేసింది కూడా. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వానికి తమ అండ ఉంటుందని ప్రతిజ్ఞ చేశారు.
ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు అన్ని విధాల సహకరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ తమ విచారాన్ని వ్యక్తం పరుస్తూ మరియు బాధితులకు నివాళులు అర్పిస్తోంది. ప్రభుత్వానికి మరియు బాధితుల కుటుంబాలకు తన మద్దతును తెలియజేయడానికి 2025 ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోని రామానాయుడు కళామండపం నుండి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తుందని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









