TGFA: తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయండి.. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు పిలుపు..

TGFA: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం జరిగి 11 యేళ్లు పూర్తై 12వ యేటఅడుగుపెట్టింది. ఈ  సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తెలుగు సినిమా అవార్డులను ప్రజా గాయకుడు గద్దర్ పేరిట  ఇవ్వాలని డిసైడ్ అయింది. అంతేకాదు పెండింగ్ లో ఉన్న 10 యేళ్లకు సంబంధించి అవార్డులను ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 14న హైదరాబాద్ హైటెక్స్ పేరిట జరిగే ఈ వేడుకను విజయవంతం చేయాలని ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు పిలుపునిచ్చారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 13, 2025, 01:07 PM IST
 TGFA: తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్  చేయండి.. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు పిలుపు..

TGFA: తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కారు కొలువు దీరిన తర్వాత గద్దర్ పేరిట ఫిల్మ్ అవార్డులను ఇవ్వనున్నట్టు ప్రకటించడమే కాకుండా.. 2024 యేడాదికి గాను అత్యుత్తమ చిత్రాలతో పాటు ఉత్తమ నటీనటులకు, టెక్నిషియన్స్ కు అవార్డులను ప్రకటించింది. అంతేకాదు  2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్‌ అందజేయనున్నట్టు  తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు సినిమా నటీనటులను, టెక్నీషియన్స్ ను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ  వేడుక కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జూన్‌ 14న అంగరంగ వైభవంగా ఈ అవార్డుల వేడుక జరగనుంది. 

ఈ సందర్భంగా తెలంగాణ గద్దర్‌  అవార్డులు అందుకోవడం పట్ల అవార్డుల విన్నర్స్ తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రేక్షకులు ఆనందం  వ్యక్తం చేస్తున్నారు. తమ  ప్రతిభను గుర్తించి తగు రీతిలో సత్కరించబోతున్న తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో అట్టహాసంగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి  సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకటరెడ్డి,  ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు ,  అత్యంత ఘనంగా జరిపించడానికి తగు ఏర్పాటు చేయిస్తున్నారు. 

ఈ ప్రతిష్టాత్మక అవార్డుల  వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. తప్పకుండా జూన్‌ 14న హైటెక్స్‌ వేడుక స్టార్స్ తో కళకళ లాడబోతుంది. కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల  సమావేశంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ '' ఈ నెల 14న హైటెక్స్‌ వేదికగా  తెలంగాణ గద్దరు అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.  దాదాపు 12 యేళ్ల తర్వాత  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన కోరారు. దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగు సినీ ఇండస్ట్రీప ఉందన్నారు.  ఆ రోజు కార్యక్రమానికి సంబంధించిన లైవ్  ఐ అండ్‌ పీఆర్‌ ద్వారా  ప్రసారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులందరికీ ఈ వేడుక‌ అందరికి రీచ్‌ అవ్వాలనదే ప్రభుత్వ నిర్ణయం అన్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుక స్టార్ట్ కానుంది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో  ప్రతి ఏడాది నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి వాటికి ఈ వేడుకలో అవార్డులు అందించబోతున్నట్టు చెప్పారు. ప్రతి యేడాదికి సంబంధించి ఎంపికైన మూడు ఉత్తమ చిత్రాలకు పనిచేసిన  హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలకు అవార్డులను అందిస్తున్నామన్నారు. ఇలాంటి ఓ మంచి సాంప్రదాయాన్ని గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులతో ఇంట్రడ్యూస్‌ చేస్తున్నామన్నారు. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులు అందజేస్తున్నట్టు తెలిపారు. 12 సంవత్సరాల తరువాత జరుగుతున్న ఈ వేడుకను తెలుగు సినీ పరిశ్రమలోని అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. 

Also Read:  ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!

Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

Trending News