Tamannaah Bhatia Odela 2 trailer video: మిల్కీ బ్యూటీ తమన్నా లేడీ అఘోరీగా ఓదెల 2లో నటిస్తున్నారు. ఈ మూవీకి టాలీవుడ్ దర్శకుడు అశోక్ తేజ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా సంపత్ నందీ దీనికి కథను అందించారు. ఈ మూవీ 2021 లో విడుదలన ఓదెల రైల్వేస్టేషన్ కు సీక్వెల్గా విడుదల కానుంది.
#Odela2 – Horror Treat Loading! ??#Tamannaah Fire Mode! ??#SampathNandi’s Vision ? pic.twitter.com/5iX9pn0of5
— Movies4u Official (@Movies4u_Officl) April 8, 2025
మొత్తంగా మూవీ టీమ్ తాజాగా. . ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 17 అభిమానుల ముందుకు రానుంది. ఈమూవీలో ట్రైలర్ చూస్తేనే మొత్తంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో నటించిన హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ఇందులో కూడా కీలక పాత్రలో కన్పించనున్నారు.
మిల్కీ బ్యూటీ కెరియర్ లో ఇదోక బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు ఈ ట్రైలర్ చూసి పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో దుష్ట శక్తుల బారి నుంచి ఓదెలా గ్రామాన్ని మల్లన్న ఎలా కాపాడుకున్నాడో అనే కాన్సెప్ట్ ను బేస్ గా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం ట్రైలర్ చూసిన అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. సినిమాను ఎప్పుడు చూస్తామా.. అంటూ కూడా ఆసక్తిగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. లేడీ అఘోరీగా తమన్నా నటన సూపర్ గా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









