The Girl Friend Collections Day 1: ది గర్ల్‌ఫ్రెండ్ డే 1 కలెక్షన్స్..రష్మిక సినిమాకు మొదటిరోజు ఎంత వచ్చిందంటే..!

The Girl Friend Collections: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద శుభారంభం నమోదు చేసింది. మొదటి రోజు కలెక్షన్లు ఆశాజనకంగా ఉన్నాయి. మరి రష్మిక గర్ల్ ఫ్రెండ్ సినిమా మొదటిరోజు ఎంత కలెక్షన్స్ తెచ్చుకునింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : Nov 7, 2025, 06:42 PM IST
The Girl Friend Collections Day 1: ది గర్ల్‌ఫ్రెండ్ డే 1 కలెక్షన్స్..రష్మిక సినిమాకు మొదటిరోజు ఎంత వచ్చిందంటే..!

The Girl Friend Day 1 Collections: ఈ ఏడాది వరుస హిట్ సినిమాల తర్వాత రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు.

Add Zee News as a Preferred Source

ఈ సినిమాలో రష్మికతో పాటు దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించగా, కృష్ణన్ వసంత సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, రామకృష్ణ-మోనిక ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు.

ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా మొత్తం 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించబడింది. ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా దాదాపు 24 కోట్ల రూపాయలు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కోసం సుమారు 14 కోట్ల రూపాయలు వెచ్చించిందని సమాచారం. శాటిలైట్ రైట్స్ 7 కోట్లకు, ఆడియో రైట్స్ 3 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.

మూవీకి లాభాల దిశగా వెళ్లాలంటే కనీసం 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రావాలని అంచనా. ప్రీమియర్స్ ద్వారా నార్త్ అమెరికాలో దాదాపు 50 వేల డాలర్లు (సుమారు 44 లక్షలు) వసూలైనట్లు ప్రత్యంగిరా సినిమాస్ తెలిపింది. ఇతర దేశాలైన యూకే, గల్ఫ్, ఆస్ట్రేలియా, యూరప్ ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 2 కోట్లు, హిందీ వెర్షన్‌తో కలిపి భారత్‌లో 3 కోట్లు, ఓవర్సీస్‌లో మరో కోటి రూపాయలు కలిపి మొత్తం 4 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more: ఎయిర్‌టెల్‌ యూజర్‌ల కోసం అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌.. 5జీ స్పీడ్‌తో అల్టిమేట్‌ చీపెస్ట్‌ ప్యాక్‌..!

Read more: పీఎం కిసాన్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. 21వ విడుత నిధులు ఎప్పుడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News