The Great Pre Wedding Show Review:‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ రివ్యూ.. మెప్పించిందా..!

The Great Pre Wedding Show Review: తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై  సందీప్ అగరం, అశ్మితా రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 6, 2025, 02:03 PM IST
The Great Pre Wedding Show Review:‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ రివ్యూ.. మెప్పించిందా..!

The Great Pre Wedding Show Review:  ‘ప్రీ వెడ్డింగ్ షో’ ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్టు ఈ బుధవారం వేసిన ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి అంచనాలకు తగ్గట్టు ఈ మూవీ ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే.. 
శ్రీకాకుళం దగ్గరలో ఓ ఊరులో రమేశ్ (తిరువీర్) ఓ ఫోటో స్టూడియోను నడిపిస్తుంటాడు. అంతేకాదు పెళ్లిళ్లకు, పేరాంటాలకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో అదే ఊరు పంచాయితీలో సెక్రటరీగా పనిచేసే హేమ (టీనా శ్రావ్య)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అటు హేమ కూడా రమేశ్ పై మనసు పడుతుంది. ఇద్దరు తమ మనసులోని ప్రేమను దాచుకోవడమే కానీ.. బయటకు చెప్పరు. ఈ క్రమంలో అదే ఊరులో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) రవి వచ్చి తన పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షో చేయమని చెబుతాడు. దీంతో రమేశ్ ఆనంద్ - సౌందర్య (యామిని)ల ప్రీ వెడ్డింగ్ షూట్ ను గ్రాండ్ గా షూట్ చేస్తాడు. 

అయితే షూట్ చేసిన ఈ ఫుటేజ్ అంతా ఓ చిప్ లో ఉంటుంది. దాన్ని తన అసిస్టెంట్  (రోహన్)కి ఇస్తాడు. అతడు ఆ చిప్ ను పోగడతాడు. ఈ విషయం తెలిస్తే.. ఆనంద్ తనను ఏమైనా చేస్తాడనే భయంతో ఆనంద్ అడిగినపుడల్లా ఏదో ఓ సాకు చెబుతూ తప్పించుకొని తిరుగుతుంటాడు. ఈ క్రమంలో రమేశ్ కు ఓ ఐడియా తడుతుంది. తాను ఈ ప్రాబ్లెమ్ నుంచి బయటపడాలంటే అతని పెళ్లిని చెడగొట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో హేమాతో కలిసి వాళ్ల పెళ్లి చెడగొట్టడానికి పడరాని పాట్లు పడతాడు. అయితే అనుకోకుండా ఆనంద్ తన పెళ్లి ఆగిపోయిందని చెబుతాడు. అసలు ఆనంద్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన ఫుటేజ్ చిప్ ఎలా పోయింది ? ఆ విషయం చివరకు ఆనంద్ తెలిసిందా.. చివరకు ఈ  ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో బయటకు వచ్చిందా.. ఇక రమేశ్, హేమాల లవ్ సుఖాంతం అయిందా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. 

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వస్తోన్న చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్యూర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్.. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్.. దాని వీడియో ఫుటేజ్ ఉన్న చిప్ పోవడం.. దాన్నిచుట్టూ కామెడీతో పాటు ఎమోషన్ తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రస్తుతం మన యూత్ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ హంగామా చేస్తున్నారు. సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు ఇలాంటివి తప్పనేవి మన పెద్దలు చెబుతున్న మాట. కానీ మారిన కాల మాన పరిస్థితుల్లో ఇలాంటవన్ని కామన్ అయిపోయాయి. అలా కాబోయే ఓ జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన ఫోటోగ్రాఫర్.. ఆ తర్వాత ఫుటేజ్ ఉన్న చిప్ పోవడంతో .. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న అబ్బాయి తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కావాలని అడగటం వంటి సీన్స్ అన్ని ఫన్నీగా ఉండటంతో ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎలాంటి బూతులు మరోవైపు నీతులు కూడా లేకుండా నీట్ గా తెరకెక్కించిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఫన్.. సెకండాఫ్ లో మిస్ అయింది. సెకండాఫ్ లో మొత్తం ఎమోషనల్ టచ్ తో తీసుకెళ్లడం బాగానే ఉన్నా.. ఫస్ట్ హాఫ్ తరహా కామెడీ మిస్ అయిందనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ తో మళ్లీ నవ్వులు పూయించి ఆడియన్స్ థియేటర్స్ నుంచి నవ్వుకుంటూ బయటకు రావచ్చు. ప్రస్తుతం యూత్ తో పాటు పెద్దవాళ్ల వాళ్ల ప్రవర్తనలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ఆర్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల విషయానికొస్తే.. 

తిరువీర్ చిన్న చిన్న పాత్రలతో మంచి నటుడి గుర్తింపు పొందాడు. తిరువీర్ ఈ సినిమాలో అమాయకుడుగా తనదైన శైలిలో మెప్పించాడు. టీనా శ్రావ్య క్యూట్ నటనతో మెప్పించింది. నరేంద్ర రవి తన నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్ లో అతన నటన మెప్పించేలా ఉంటుంది. బాల నటుడు రోహన్ రాయ్ కూడా తన యాక్టింగ్ తో కితకితలు పెట్టాడు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించాడు. 

తిరువీర్ ఎప్పటిలాగానే కాస్త అమాయకంగా కనపడే పాత్రలో బాగానే మెప్పించాడు. టీనా శ్రావ్య క్యూట్ గా కనిపించి అలరించింది. నరేంద్ర రవి మాత్రం సినిమా తన భుజాలపై మోశాడు అనిపిస్తుంది. ఓ పక్క నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కూడా అదరగొట్టాడు. పక్కన హీరో ఉన్నా కథకు తగ్గట్టు నరేంద్ర పాత్రను చాలా బాగా రాసుకున్నారు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చి మరిన్ని పాత్రలు రావడం ఖాయం. యామిని కూడా తన పాత్రలో బాగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ కూడా బాగానే నవ్వించాడు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

రేటింగ్: 3/5

గమనిక.. ఈ రివ్యూ రేటింగ్ విశ్లేషకుడు పర్సనల్ ఓపియన్ మాత్రమే.. 

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News