Star Director Passes Away at 76: సినిమా ఇండస్ట్రీకి అలా అని..యానిమేషన్ ప్రపంచానికి తీరని లోటు జరిగింది. డిస్నీ రూపొందించిన సూపర్ హిట్ యానిమేటెడ్ మూవీ ది లైన్ కింగ్.. కు కో-డైరెక్టర్‌గా పనిచేసిన ప్రముఖ దర్శకుడు Roger Allers (76) కన్నుమూశారు. ఆయన శాంటా మోనికా, కాలిఫోర్నియాలోని తన నివాసంలో అనారోగ్యంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్తతో యానిమేషన్ అభిమానులు, సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యారు.
రోజర్ అల్లర్స్ 1949 జూన్ 29న న్యూయార్క్‌లోని రై నగరంలో జన్మించారు. చిన్న వయసు నుంచే చిత్రకళ.. కథలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఆసక్తే ఆయనను యానిమేషన్ ప్రపంచం వైపు నడిపించింది. అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చదివి, తన కళా ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. చదువు పూర్తయ్యాక డిస్నీ సంస్థలో చేరి అనేక చిత్రాలకు పని చేశారు.
1994లో విడుదలైన ది లయన్ కింగ్ ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాను రాబ్ మింకాఫ్‌తో కలిసి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం విడుదలైన వెంటనే ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలను.. కూడా ఆకట్టుకున్న ఈ సినిమా, డిస్నీ చరిత్రలోనే అత్యంత గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. సంగీతం, భావోద్వేగాలు.. పాత్రల రూపకల్పన అన్నీ కలిసి ఈ సినిమాను ఒక క్లాసిక్‌గా మార్చాయి.
ది లయన్ కింగ్ కంటే ముందు.. తరువాత కూడా రోజర్ అల్లర్స్.. అనేక ప్రసిద్ధ యానిమేటెడ్ చిత్రాలకు పని చేశారు. అలాద్దీన్, బ్యూటీ అండ్ ది బీస్ట్, ఒలివర్ అండ్ కంపెనీ వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు..ది లయన్ కింగ్ ను బ్రాడ్‌వే నాటకంగా మార్చడంలో కూడా ఆయన భాగస్వామ్యమయ్యారు. ఈ నాటకానికి టోనీ అవార్డు నామినేషన్ కూడా వచ్చింది.
ఆయన మరణంపై డిస్నీ సీఈవో బాబ్ ఇగేర్..తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోజర్ అల్లర్స్ యానిమేషన్‌కు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. అని అన్నారు. రోజర్ అల్లర్స్ ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లారు. ఆయన రూపొందించిన సినిమాల ద్వారా.. ఆయన స్మృతి ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో జీవిస్తూనే ఉంటుంది.
Also Read: Anaganaga Oka Raju Box Office Collections:‘అనగనగా ఒక రాజు’ తో నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో హిట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









