)
The Luck Reality Show : దేశంలో కామన్ మ్యాన్ కోసం అతిపెద్ది రియాలిటి షో ‘ది లక్’ రాబోతుంది. ఇందులో గెలిచిన వారికి రూ. 10 లక్షల కారు బహుమతిగా ఇవ్వబోతున్నారు. ప్రెజెంట్ రియాలిటీ షో లపై ప్రస్తుతం ప్రజల్లో క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. కేబీసీ తరహా గేమ్ షోలు తెలుగులో కూడా మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ రియాలిటీ షోలు వచ్చాయి. అందులో నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్ వంటి హీరోలు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా ఒక రియాలిటీ షో ను షురూ చేయబోతుంది. ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల నుండి పలు భాషల్లో రియాలిటీ షోలు ఉండగా అవి అన్ని ఎంతోకొంత సినీ సెలెబ్రిటీలను, అలాగే ఇతర రంగాలలో ప్రముఖులను షోలో భాగంగా చేస్తున్నారు. అందులో సామాన్యులకు చోటు కల్పించడం లేదు.
కాని దేశంలోనే తొలిసారిగా కేవలం సామాన్యులు మాత్రమే తమ గేమ్ లో ఉండే విధంగా ‘ది లక్’ అనే రియాలిటీ షో రాబోతుంది. ఈ విషయాన్ని ఈ షో నిర్వాహకులు తెలిపారు. తాజాగా వీరు మీడియా సమక్షంలో ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బృందం "ది లక్" పోస్టర్ లాంచ్ చేసారు. ఈ షోను ఒక పెద్ద సెలబ్రిటీ హోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. యూట్యూబ్ & ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం పై ఈ రియాలిటీ షో స్ట్రీమ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా ఆర్ట్స్ బృందం ఈ గేమ్ షోకు సంబంధించిన కొన్ని అంశాలను మీడియాతో పంచుకున్నారు.
‘ది లక్’ మెయిన్ పాయింట్స్.. స్థైర్యం, వ్యూహం, ఓర్పు ఆధారంగా ఉండే సులభమైన సవాళ్లు ఉండేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దబోతున్నట్టు చెప్పారు. కేవలం కృషితో పాటు దృష్టి సారించడం చివరకు అదృష్టం నేపథ్యంలో ఉండబోతున్నట్టు చెప్పారు. ఇందులో ప్రతి విన్నర్ కు రూ. 10 లక్షల బహుబతి ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని చెప్పారు.
ఈ రియాలిటి షో సహనం, పట్టుదల, వినోదం నేపథ్యంలో ఉండబోతున్నట్టు చెప్పారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వారికి ఓ బహుమతి ఉంటుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. దీనికి ప్రశాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ బాల లైన్ ప్రొడ్యూసర్.. ఈ ఆటలో పాల్గొనే వాళ్లు www.theluck.world వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వండని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి