The Suspect: ది సస్పెక్ట్ మూవీ పోస్టర్ విడుదల.. క్రైమ్ థ్రిల్లర్‌కు సరికొత్త అనుభూతి ఇవ్వనున్న సినిమా..

The Suspect Poster: క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఒక డిఫరెంట్ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకులను మెప్పించనుంది. ది సస్పెక్ట్ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతోంది అంటూ చెప్పుకొచ్చారు సినిమా యూనిట్. ఇక ఈ సినిమా నుంచి ఈరోజు విడుదలైన మొదటి లుక్ సైతం అందరిని ఆకట్టుకుంది.

Written by - Vishnupriya | Last Updated : Mar 10, 2025, 08:11 PM IST
The Suspect: ది సస్పెక్ట్ మూవీ పోస్టర్ విడుదల.. క్రైమ్ థ్రిల్లర్‌కు సరికొత్త అనుభూతి ఇవ్వనున్న సినిమా..

The Suspect Update:

Add Zee News as a Preferred Source

ది సస్పెక్ట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా విడుదలైంది. మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, థ్రిల్లింగ్ కథనంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ, అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఉత్కంఠభరితమైన కథనం కలిగిన క్రైమ్ థ్రిల్లర్ అయిన ది సస్పెక్ట్ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందడం ఆనందంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  

ఈ చిత్రంలో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ.కె.ఎన్ ప్రసాద్, మృణాల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ, టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్‌పై నిర్మించబడింది.  

సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ మేళవించి విభిన్న కోణంలో ఒక క్రైమ్ ను విచారించే ప్రత్యేక పరిశోధన బృందం కథను తెరకెక్కించడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు తన ప్రతిభను చూపించారు.  
  

ఈ చిత్రానికి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర సినిమాకు మెరుగైన విజువల్స్ అందించగా, సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్ హృద్యమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఎడిటర్ ప్రవీణ్ కట్టిపడేలా చిత్రాన్ని మలచారు.  

ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎస్.కె.ఎమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్రా, తెలంగాణల్లో భారీ స్థాయిలో మార్చి 21న విడుదల చేయనున్నారు. నూతన కథనంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ సినిమా సిద్ధమైంది.

Read more: Viral Video: డైలీ మూడుసార్లు షాంపుతో హెయిర్ బాత్.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News