The Suspect Trailer Launch Event: తెలుగులో వస్తోన్న మరో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ది సస్పెక్ట్’. టైటిల్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఋషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించారు.
అంతేకాదు ‘ది సస్పెక్ట్’ చిత్రాన్ని ఈ నెల 21న ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ఛీప్ గెస్ట్ గా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ పద్మినీ నాగులపల్లి మాట్లాడుతూ - ది సస్పెక్ట్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టిస్టులు అందరూ బాగా యాక్ట్ చేశారు. దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది.
దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - ది సస్పెక్ట్ మూవీ ట్రైలర్ నా చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రొడ్యూసర్ కిరణ్ నాకు ఎప్పటినుంచో స్నేహితులు. ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే కాదు మంచి క్యారెక్టర్ లో నటించారు. పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్ చేసినవి ఉన్నాయి. చిన్న చిత్రాలు అద్భుతంగా ఆదరణ పొందుతున్న సందర్బాలున్నాయి. ది సస్పెక్ట్ సినిమా చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలన్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే రాధాకృష్ణ లాంటి దర్శకులకు మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఇలాంటి సినిమాలకు మంచి లాభాలు రావాలన్నారు. మీరంతా ది సస్పెక్ట్ చిత్రానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.
నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ - సినిమా రంగంలోకి రావాలనేది నా డ్రీమ్. ది సస్పెక్ట్ సినిమాతో ఆ కల నెరవేరింది. నా స్నేహితుడు వీఎన్ ఆదిత్య మా సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావడం ట్రైలర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. రాధాకృష్ణ చేసిన ఒక షార్ట్ ఫిలిం చూసి నచ్చి ఈ సినిమాకు డైరెక్ట్ చేయమని అడిగాను. ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ - ది సస్పెక్ట్ సినిమాలో పాటను విడుదల చేయడం హ్యాపీగా ఉందన్నారు. మూవీ ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ సినిమాలో ఓ పాట రాయడం విశేషం. ఈ సినిమా కిరణ్ మంచి పేరు డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నాన్నారు.
డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ - ఈ రోజు మా సస్పెక్ట్ సినిమా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సినిమా చేసేందుకు పడే కష్టం చిన్న చిత్రానికైనా పెద్ద చిత్రానికైనా ఒక్కటే కష్టముంటుందన్నారు. మేము ఈ సినిమాను అందరికీ నచ్చేలా మంచి సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా రూపొందించామన్నారు. ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో సాగే చిత్రమిది. కొత్త ఆర్టిస్టులైనా ఎంతో అనుభవం ఉన్న వారిలా బాగా నటించారు. ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కిరణ్ కి థ్యాంక్స్. మా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ఆదినారాయణ కి థ్యాంక్స్. ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న ది సస్పెక్ట్ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









