Chhaava Movie latest news: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరపుత్రుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను లక్ష్మణ్ ఊటేకర్ తెరకెక్కించారు. ఈ మూవీలో శంభాజీ మహరాజ్ ఆయన సతీమణి యేసుబాయి పాత్రలను విక్కికౌశాల్, రష్మిక మందన్నన నటించారు. హిందు స్వరాజ్ కోసం ఛత్రపతి శివాజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు శంభాజీ మహారాజ్ చేసిన త్యాగాలు, గొప్ప యుద్దాలు, దేశం కోసం చివరకు ఆత్మబలిదానం కూడా ప్రతిదీ ఈ మూవీలో నటించారు.
ఈ సినిమాకు వచ్చిన వారంతా ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ కు గురయ్యారు. ఇంత గొప్ప వీరుడి కథను తమకు తెలియకుండా.. పుస్తకాల్లో లేకుండా చరిత్ర కారులు తొక్కేశారనిన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చావా మూవీ ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైంది. ఆ తర్వాత బాక్సాఫీస్ మీద 700 కోట్ల వసూళ్లు దిశగా పరిగెడుతుంది. ఇక ఇటీవల చావాను అభిమానుల కోరిక మేరకు తెలుగులో కూడా విడుదల చేశారు.
అయితే.. చావా సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక వచ్చే రోజుల్లో చావా వెయ్యి కోట్ల మార్క్ ను తాకడం పక్కా అని అభిమానులు అంటున్నారు. అయితే.. చావా మూవీలో శంభాజీ పాత్రలో విక్కి కౌశాల్ ఎంతగా అదరగొట్టాడో.. విలన్ పాత్రలో..అక్షయ్ ఖన్నా ఔరంగాబాద్ పాత్రలో.. ఒక రేంజ్ లో అదరగొట్టాడు. తన హవాభావాలు, డైలాగ్ డెలీవరీతో హీరోకు తగ్గాఫార్ గా నటించాడు.
మొత్తానికి ఔరంగాబాద్ ఎంత క్రూరంగా ఉండేవాడో తన నటనతో అందరికి చూపించాడు.ఈ క్రమంలో ప్రస్తుతం చావా సినిమాకు వస్తే.. అందురు విక్కి కౌశాల్ కు ఎన్ని మార్కులు వేస్తున్నారో.. ఔరంగాజేబ్ పాత్రకు అంతే క్రేడిట్ ఇస్తున్నారు. ఎందు కంటే.. ఒక సినిమా హిట్ అవ్వాలంటే.. హీరో మాత్రమే కాకుండా.. విలన్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది.
ఈ మూవీలో అక్షయ్ ఖన్నా తన పర్ఫామెన్స్ తో బాక్సాఫీస్ మీద దుమ్మురెగ్గొట్టారని అభిమానులు అంటున్నారు. అయితే.. చావా మూవీలో విలన్ కోసం.. టాలీవుడ్ హీరో దగ్గుబాటి రాణాను సంప్రదించారంట. కానీ ఆయన దీనికి అంగీకరించలేదంట. ఆ తర్వాత బాబీ డియోల్ ను కూడా సంప్రదించారంట. కానీ ఆయన కూడా తన బిజిషెడ్యూల్ వల్ల మూవీకి అంగీకరించలేదంట.
చివరకు.. చావా సినిమాటీమ్.. అక్షయ్ ఖన్నాను ఔరంగాబాద్ పాత్రకు ఫైనల్ చేశారంట. ఈ క్రమంలోఈ వార్తలలో నిజముందో తెలీయదు కానీ.. సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్గా మారింది. ఒకవేళ దగ్గుబాటి రాణా దీనిలో విలన్గా చేసిఉంటే.. తెలుగు వర్షన్ కు మరింత ప్లేస్ అయ్యి ఉంటేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









