Ramya Krishna Mahesh Babu: ఇండస్ట్రీలో నటీనటుల కాంబినేషన్లు ఊహించదగినవి కావు. కొందరు నటులు ఒక సినిమాలో హీరోకు జోడీగా నటిస్తే, మరొక సినిమాలో వేరే పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్‌లలో రమ్యకృష్ణ, మహేష్ బాబు కలిసి చేసిన చిత్రాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.
రమ్యకృష్ణ మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించగా, మరొక సినిమాలో అతని తల్లిగా కనిపించారు. ఈ విభిన్న కాంబినేషన్ ఎంతోమందినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Ramya Krishna as Mother to Mahesh Babu ;త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, కమర్షియల్‌గా మంచి వసూళ్లు సాధించింది. రమ్యకృష్ణ ఈ సినిమాలో తన సహజమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
Ramya Krishna as Item Girl to Mahesh Babu ;ఇక మరోపక్క..మహేష్ బాబు, ఎస్.జే. సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘నాని’ సినిమాలో రమ్యకృష్ణ ఓ ప్రత్యేక గీతంలో నటించారు. ‘మార్కండేయా’ అనే పాటలో ఆమె తన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఒకే హీరోతో ఒక సినిమాలో తల్లిగా, మరో సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించడం ఇండస్ట్రీలో అరుదుగా కనిపించే సంగతే.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఊహించని కాంబినేషన్లు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తాయి. మహేష్ బాబు, రమ్యకృష్ణ కలిసి చేసిన విభిన్న పాత్రలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. రాబోయే రోజుల్లో వీరి కాంబినేషన్ మరో ఆసక్తికరమైన సినిమా వస్తుందో లేదో చూడాలి.
ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB29 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ప్రియాంక చోప్రా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









