Thug Life First Review: ‘థగ్ లైఫ్’ ఫస్ట్ రివ్యూ.. కమల్ హాసన్, మణిరత్నం సినిమాపై ఎలా ఉంది..!

Thug Life First Review: ఈ యేడాది భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో  “థగ్ లైఫ్” ఒకటి. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేసన్స్ ఉన్నాయి.  ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఈ గురువారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 5, 2025, 12:00 AM IST
Thug Life First Review: ‘థగ్ లైఫ్’ ఫస్ట్ రివ్యూ.. కమల్ హాసన్, మణిరత్నం సినిమాపై ఎలా ఉంది..!

Thug Life First Review: కమల్ హాసన్, మణిరత్నం కాంబినేష్ లో వచ్చిన 'నాయకుడు' సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో రిపీట్ అయింది. దీంతో థగ్ లైఫ్ మూవీపై  భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మణిరత్నం వరుసగా పొన్నియన్ సెల్వన్ సిరీస్ సక్సెస్ తో మంచి ఊపు మీదున్నారు. అటు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయినా.. కమల్, మణిరత్నం కాంబో అనగానే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక భారతీయ సినీ పరిశ్రమలో బిగ్ పవర్ హౌసెస్ కమల్ హాసన్, మణిరత్నం 38 ఏళ్ల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలిసి రావడం విశేషం. 

Add Zee News as a Preferred Source

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన అయిన ప్రమోషనల్ కంటెంట్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.  టీజర్, ట్రైలర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పాటలు చార్ట్‌బస్టర్  గా నిలిచాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు మేకర్స్. 

ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి వంటి స్టార్స్ నటించారు. తమిళ్‌తో పాటు తెలుగులోను ఈ సినిమాకు సాలిడ్ బజ్‌ ఉంది. హీరో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో చేస్తున్నారు. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు 'థగ్ లైఫ్'ని గ్రాండ్‌గా తెలుగులో విడుదల చేయబోతుంది. విక్రమ్, అమరన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ నుంచి వస్తున్న థగ్ లైఫ్.. ఆ సంస్థకు హ్యాట్రిక్ విజయాన్ని అందిచడం ఖాయమనే అంచనాలున్నాయి. 

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు శింబు  ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం తో సినిమాపై అంచనాలు పెరిగాయి. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న శింబు.. కేవలం మణిరత్నం, కమల్ హాసన్ కోసం ఈ చిత్రంలో నటించడం విశేషం. చిన్నప్పటి వారి సినిమాలను చూసి పెరిగిన శింబు.. ఈ సినిమాలో వారితో కలసి నటించడం తన అదృష్టమన్నారు.  శింబు క్యారెక్టర్ సినిమాలో హైలెట్‌గా ఉందనే టాక్. అలాగే.. పొన్నియన్ సెల్వన్‌తో కంబ్యాక్ ఇచ్చిన త్రిష ఈ సినిమాలో నటిస్తుండడం మరింత క్రేజ్ తీసుకొచ్చింది. త్రిష తన కెరీర్‌లో ఇంత వరకు పోషించని ఓ కొత్త పాత్రను ఇందులో పోషిస్తున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ థగ్ లైఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారనేది టాక్. మణిరత్నం, రెహమాన్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు గతంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఇప్పుడు మరోసారి థగ్ లైఫ్‌తో అదే  మ్యాజిక్ రిపీట్ చేసారనే చెప్పాలి.  ఓవరాల్‌గా.. నాయగన్‌ లాగే మణిరత్నం, కమల్ కెరీర్లో 'థగ్ లైఫ్' సినిమా మరో మైలు రాయిగా నిలిచిపోయేలా ఉన్నాయనేది టాక్. 

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News