Allari naresh grand father eedara Venkat rao passed away: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఫెమస్ దర్శకుడు దివంగత ఈ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో ఈ ఘటన సంభవించింది. దీంతో ఇండస్ట్రీ అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ , ఆర్యన్ రాజేష్ ల తాత గారైన ఈదర వెంకట్ రావు మంగళవారం(జనవరి 20) తెల్లవారుజామున కన్ను మూశారు. గత గంత కాలంగా ఆయన అనేక రకాలవృద్ధాప్య సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయనకు 90 ఏళ్లు.
మరోవైపు వెంకట్ రావు సతీమణి వెంకటరత్నం 2019 మే 27న మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు దివంగత ఈ.వి.వి. సత్యనారాయణ. రెండో కుమారుడు ఇ.వి.వి. గిరి, మూడో కుమారుడు ఇ.వి.వి. శ్రీనివాస్ కాగా, కూతురు ముళ్ళపూడి మంగాయమ్మ.
Read more: Rashmika Mandanna: అవన్ని పచ్చిఅబద్దాలు.!. పెళ్లి వార్తలవేళ బాంబు పేల్చిన రష్మిక మందన్న..
అల్లరి నరేష్ ఇంట విషాద వార్త తెలిసి ఇండస్ట్రీలోని వారంతా నరేష్ ఇంటికి వెళ్లి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఫోన్ లలో మాట్లాడి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అల్లరి నరేష్ అభిమానులు సైతం తమ హీరోకు ఈ విషాదంను ఎదుర్కొనే ధైర్యంను ఆ భగవంతువుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









