Jagapathi babu amani funny video viral: జగపతి బాబు, ఆమని పెయిర్ ను అప్పట్లో హిట్ పెయిర్ గా చెప్పేవారు. ఈ జంట గతంలో శుభలగ్నం, మావిచిగురు, తీర్పు సినిమాల్లో నటించారు. అయితే.. శుభలగ్నం సినిమాలో జగపతి బాబు, ఆమని భార్యభర్తలు. అయితే.. ఆమనికి భర్త కంటే.. డబ్బులు, బంగారం అంటేనే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేంది. విలాస వంతమైన జీవితంను కోరుకునేంది. ఈ క్రమంలో జగపతి బాబును మరో యువతికి అమ్మేస్తుంది. ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆదరించారు.
ఇప్పటికి కూడా.. చాలా మంది మహిళలు.. డబ్బుల కోసం ఏమైన విసిగించే మాటలు అంటే.. మగాళ్లు.. శుభలగ్నంలా తమను అమ్మేయ్.. అంటూ సెటైర్ లు సైతం వేస్తారు. ఈ క్రమంలో మరోసారి ఈ హిట్ పెయిర్ ఒకచోటీకి చేరుకున్నారు. జగపతి బాబు ఒక వెబ్ సిరిస్ లో చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమనికి మేకప్ బాయ్ లా మారిపోయారు.
ఆమని కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చుని మేకప్ సరిగ్గా వేయమని.. జగపతి బాబుకు హుకూం జారీ చేసింది. మధ్య మధ్మలో బెదిరిస్తూ.. గొడుగు నీకా.. నాకా.. ఎండకు నాకు కొడుతుందని.. జగపతి బాబుకు చుక్కలు చూపించింది. పాపం.. జగపతి బాబు.. మెల్లగా ఆమనికి బ్రష్ తో మేకప్ చేస్తుంటే.. సరిగ్గా చేయాలని గట్టిగా అరిచి మరీ చెప్తుంది.
ఈ నేపథ్యంలో జగపతి బాబు ఫన్నీగా.. ఏంటీ నన్ను మళ్లీ కోటీకి అమ్మేస్తావా.. ఏంటీ అంటూ ఫన్నీగా కౌంటర్ వేస్తారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కడుపబ్బా నవ్వుకుంటున్నారు. మళ్లీ అప్పట్లో తీసిన శుభలగ్నం సీన్ గుర్తుకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.
ఇక జగపతి బాబు.. పుష్ప2 లో విలన్ గా ఒక రేంజ్ లో అదరగొట్టాడు. అటు ఆమని కూడా అమ్మగా, అత్తగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది. గతంలో .. 'పటేల్ సార్' అనే సినిమాలో జగపతిబాబు, ఆమని ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే.. జగపతి బాబు.. ఆమని ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.









