Tollywood Casting Couch: టాలీవుడ్ యువ నటి, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ తేజస్వి గురించి తెలియనివారుండరు. అందంగా, చలాకీగా ఉండే తేజస్వి పెద్ద పెద్ద హీరోలతో నటించి పేరు తెచ్చుకుంది. ఈ మధ్యన వివిధ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన విషయాలు వెల్లడించింది.
తాజాగా టాలీవుడ్‌లో మహిళలకు ఎదురయ్యే కమిట్‌మెంట్లపై మాట్లాడింది. అసలు మహిళల్ని ఏ విధంగా కమిట్‌మెంట్ అడుగుతారో వివరించింది. కమిట్‌మెంట్ సమస్య ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఉందంటూ తేజస్విని ముదివాడ సంచలనం రేపింది. కొందరైతే చాలా సులభంగా కమిట్‌మెంట్లు అడుగుతుంటారని వెల్లడించింది. కొందరు కమిట్‌మెంట్ అడిగే విధానమే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తేజస్వి తెలిపింది. చాలా అసహ్యకరంగా వ్యవహరిస్తుంటారని స్పష్టం చేసింది.
తెలుగు సినీ పరిశ్రమలో బయటకు పెద్దోళ్లుగా చలామణి అయ్యే చాలామందికి ఈ అలవాటు ఉందని వివరించింది. ముందుగా పరిచయం చేసుకుని చేతుల్ని తాకుతుంటారని తేజస్వి తెలిపింది. ఇరువురి మధ్య కాస్త సాన్నిహిత్యం పెరిగిన తరువాత కమిట్‌మెంట్ అడుగుతారని చెప్పింది. తనకు కూడా కెరీర్ ప్రారంభంలో ఇదే సమస్య ఎదురైందని తేజస్వి వెల్లడించింది. సినిమా ఆఫర్ల కోసం తిరిగేటప్పుడు సాయంత్రం దర్శకుడు లేదా నిర్మాతతో డిన్నర్ ఉంటుందని చెప్పేవారని తేజస్వి తెలిపింది. మొదట్లో అర్ధం కాలేదని కానీ తరువాత తన వైఖరి చూసి దూరం ఉండేవారని వివరించింది.
ధైర్యంగా వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీతో ఉంటే ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు, కమిట్‌మెంట్లు ఏం చేయలేవని సీనియర్ నటీ నటులు వివరిస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. కమిట్‌మెంట్లు వెంటాడుతూనే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి సినీ పరిశ్రమలోనూ ఈ పరిస్థితి తప్పడం లేదు. గతంలో చాలామంది ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా తేజస్వి కమిట్‌మెంట్లు ఎలా అడుగుతారో వివరించింది.
Also read: AP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









