)
Tollywood Actress Hema mother passes away in razole: టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి హేమ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. నటి హేమ ఇంట్లో అనుకొని విషాదం చోటు చేసుకుంది. హేమ తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్య సమస్యలతో తూర్పు గోదావరిలోని రాజోలులో కన్ను మూసింది.ఈ వార్త వినగానే హేమ చాలా షాక్ కు గురైంది. నిన్న సోమవారం కూడా తన తల్లితో మాట్లాడినట్లు చెప్పింది. మరణ వార్త వినగానే నటి హేమ వెంటనే రాజోలుకు చేరుకుంది.
కొన్నిరోజులుగా హేమ తల్లి కోళ్ల లక్ష్మి కిడ్ని సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు 80 సంవత్సరాలు. ఆమె ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం (నవంబర్ 17వ తేదీ) రాత్రి ఆకస్మిక మరణం చెందారు. తన తల్లి అంటే హేమకు అత్యంత ప్రేమ. తరచుగా తన తల్లి కోసం రాజోలు వస్తుండేది.
మాతృమూర్తి మరణ వార్త తెలిసిన వెంటనే స్వగ్రామం రాజోలు వెళ్లారు హేమ. నిన్న కూడా తల్లితో తాను మాట్లాడానని, అయితే ఇప్పుడు ఆమెను ఇలా చూస్తానని అనుకోలేదంటూ హేమ గుండెలవిసేలా రోదించింది. మరోవైపు హేమ తల్లి మరణ వార్త తెలుసుకున్న నెటిజన్స్ ఆమెను ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి