Actress Madhavi latha: పనిపాటలేదారా.. పచ్చళ్ల పాపల మీద పడ్డారు..!. . రంగంలోకి దిగిన టాలీవుడ్ హీరోయిన్.. ఏమన్నారంటే..?

Alekhya chitti pickle controversy: అలేఖ్య చిట్టి పిక్కిల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.ఈ క్రమంలో దీనిపై కొంత మంది అలేఖ్య సిస్టర్స్ కు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. వీరిని ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా.. టాలీవుడ్ నటి మాధవీలత అలేఖ్య సిస్టర్స్ వివాదంపై మాట్లాడారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 9, 2025, 09:46 AM IST
  • ట్రొలర్స్ పై మండి పడిన మాధవీలత..
  • అలేఖ్య రచ్చను వదిలేయాలని వార్నింగ్..
Actress Madhavi latha: పనిపాటలేదారా.. పచ్చళ్ల పాపల మీద పడ్డారు..!. . రంగంలోకి దిగిన టాలీవుడ్ హీరోయిన్..  ఏమన్నారంటే..?

Madhavilatha on alekhya chitti pickle controversy: అలేఖ్య చిట్టి సిస్టర్స్ తమ నోటీదూలతో ఒక్కసారిగా తమ బిజినెస్ ను క్లోజ్ చేసుకునే వరకు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు మాత్రం వీరిని ట్రోల్స్ చేస్తునే ఉన్నారు. ఇక తాజాగా.. అలేఖ్య చిట్టి ఆస్పత్రిలో చేరిందని, ఐసీయూలో చికిత్స తీసుకుంటుందని ఆమె సోదరి సౌమ్య వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికైన దండం పెడతాం.. తమను దయచేసి వదిలేయాలని కూడా వేడుకున్నారు. చివరకు ట్రోలర్స్ .. తన తండ్రి చనిపోతే.. సమాధిని కూడా ట్రోలింగ్ చేశారని అలేఖ్య సిస్టర్స్ ఎమోషనల్ అయ్యారు.

Add Zee News as a Preferred Source

తమను మొత్తంగా రోడ్డు మీదకు లాగేశారని.. ఇంకా తమకు నష్టం కల్గించడానికి ఏమి మిగల్లేదని ఇప్పుడైన వదిలేయాలని కూడా వేడుకున్నారు. ఈ క్రమంలో ఈఘటనపై తాజాగా.. టాలీవుడ్ నటి మాధవీలత తనదైన స్టైల్ లో మాట్లాడారు. అలేఖ్య చిట్టి పిక్కిల్స్ అంశంపై మాట్లాడుతూ.. దేశంలో ఒకవైపు వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి చర్చ జరుగుతుందని, మరోవైపు ఐపీఎల్, అదే విధంగా హెచ్ సీయూ 400 ఎకరాల వివాదం నడుస్తుందన్నారు.

ఇన్ని ఘటనలు వదిలేసి.. పచ్చళ్ల అమ్మాయిల మీద పడ్డారేంట్రా అని ట్రోలర్స్ పై మండిపడింది. వాళ్లను ట్రోల్స్ చేస్తున్న వారు.. ఆ అమ్మాయిలను ఎందుకు ఫాలో అయ్యారని.. బాడీ కన్పించేలా దుస్తులు వేసుకుంటే.. మీరే కదా వాళ్లను ఫెమస్ చేశారు.. ఇప్పుడేమో.. వాళ్లను ఒక్కసారిగా పాతళంకు తొక్కేసి.. ఇలా ట్రోల్స్ చేస్తున్నారని కూడా మండిపడింది.

Read more: YS Jagan VS SI Video: జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..!.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పోలీసు.. వీడియో వైరల్..  

సమాజంలో లేదా మీకు ఏదైన పనికి వచ్చే పనులు చేయాలని చురకలు పెట్టింది. అదే విధంగా యువత దేశానికి వెన్నెముక అంటారు. అలాంటిది ఇలా.. పచ్చళ్ల పాపలు అంటూ.. చిన్న  విషయాలపై ట్రొల్స్ చేయడం వదిలేయాలని చెప్పింది. పచ్చళ్ల పాపలకు మొగుడెవరస్తారు.. వాళ్లకు పిల్లలు ఎలా పుడతారని విషయాలను వదిలేసి.. మీ ఫ్యూచర్ గురించి ప్లాన్ లు వేసుకొవాలని నటి మాధవీలత ట్రోలర్స్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News