Pooja Hegde Video: నేను చాలా లక్కీ.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఎమోషనల్ అయిన పూజా హెగ్డె.. వీడియో వైరల్..

Pooja Hegde visits Tirumala:  టాలీవుడ్ నటి పూజా హెగ్డె తన కుటుంబంతో కలసి తిరుమలకు వెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేకంగా మొక్కలు తీర్చుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. బుట్టబొమ్మ వరుసగా గుడుల చుట్టు తిరగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2025, 12:48 PM IST
  • డెవోషనల్ మూడ్ లో పూజా..
  • తిరుమలలో ప్రత్యేక పూజలు..
Pooja Hegde Video:  నేను చాలా లక్కీ.. తిరుమలలో శ్రీవారిని  దర్శించుకుని ఎమోషనల్ అయిన పూజా హెగ్డె.. వీడియో వైరల్..

Tollywood Actress pooja hegde visits Tirumala temple video: ముకుంద సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డె తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ ను కొట్టేసింది. అదే విధంగా తనదైన అందం, అభినయంతో అభిమానుల్ని తనవైపుకు తిప్పుకుంది. తక్కువ టైమ్ లోనే స్టార్ డమ్ సంపాదించింది. అయితే.. ఈ పొడుగు కాళ్ల సుందరీ ఇటీవల సినిమాల పరంగా అవకాశాలు కాస్తంతా తగ్గినట్లు తెలుస్తొంది. ఒకప్పుడు ఉన్న జోష్, ఊపు ఇప్పుడు పూజా హెగ్డెలో కన్పించడంలేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తొంది.

Add Zee News as a Preferred Source

ఇదిలా ఉండగా.. ఈ భామ.. ఇటీవల వరుసగా ఆలయాలను దర్శించుకుంటూ బిజీగా ఉంటున్నారు. నిన్నన (గురువారం ).. శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంను దర్శించుకున్న పూజా హెగ్డె అక్కడ రాహు, కేతుల పూజలు చేయించుకున్నారు. సాధారణంగా రాహు, కేతు దోషాలు ఉంటే.. జీవితంలో కెరియర్ పరంగా ఆటంకాలు ఎదురౌతాయి. పెళ్లిళ్లు కూడా తొందరగా సెట్ కావు. అందుకే ఈ భామ.. ఆ దోషాలను నివారించుకునేందుకు శ్రీకాళ హస్తీకి వచ్చినట్లు వార్తలు వైరల్గా మారాయి.. ఇక మరోవైపు బుట్టబొమ్మ ఈరోజు (శుక్రవారం) తిరుమలకు చేరుకున్నారు.

 

తన కుటుంబంతో కలిసి తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శనంలో సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. పండితులు కూడా టాలీవుడ్ నటికి తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనం అందజేశారు. ఇదిలా ఉండగా..  పూజా హెగ్డె వరుసగా ఆలయాలను సందర్శించుకొవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో  హాట్ టాపిక్ గా మారింది.

ఆమె అభిమానులు సైతం.. దీనిపై ఆరాలు తీస్తున్నారు. మరీ పూజా హెగ్డె కెరియర్ పరంగా ఆటంకాల నుంచిబైటపడేందుకా.. లేదా ఇంకా పెళ్లికి ఓకె చెప్పేసిందా.. అన్న విధంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా పూజా హెగ్డె మాత్రం వార్తలలో నిలిచారు. ఇక సినిమాల పరంగా చూస్తే.. పూజా హెగ్డె ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారు. 

 తిరుమలను దర్శించువకొవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఒక బలమైన కోరికతో ఇక్కడకు వచ్చానన్నారు. ఆ దేవుడి దయతో స్వామి వారి దర్శనంమంచిగా అయ్యిందన్నారు.  నిజంగా తన జీవితంలో ఈరోజు మర్చిపోలేని రోజని చెబుతూ  పూజా హెగ్డె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 Read more: Alekhya Sisters Video: అలేఖ్య చిట్టి  పిక్కిల్స్..  వెలుగులోకి వచ్చిన మరో బూతు మాటల వీడియో.. నెటిజన్లు షాక్..  

పూజా హెగ్డె తమిళంలో నటించిన రెట్రో మూవీ విడుదలకు రెడీగా.. కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించినఈ మూవీ కార్తీక్ సుబ్బారాజ్ దర్వకత్వం వహిస్తున్నారు.  మే 1న పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది. మరోవైపు.. రజీనీ కాంత్ లోకేష్ కనగరాజ్ లో కాంబోలో కూలీ మూవీలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది ఈ భామ. అంతేకాకుండా.. రాఘవా లారెన్స్ మూవీ కాంచన 4 లో కూడా పూజా చాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News