HBD Music Director Gowra Hari: తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటున్నారు గౌర హరి. ఈ రోజు (మార్చి 14)న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ గౌర హరి మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘హనుమాన్’ సినిమా తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపింది. అంతేకాదు 2024లో తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అంతేకాదు ‘హనుమాన్’ సినిమాకు గౌర హరి అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ లో గౌర హరి మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ గా నిలిచింది. హనుమాన్ సినిమా సక్సెస్ లో ఇది కూడా ఓ కీ రూల్ పోషించింది. హానుమాన్ సినిమాలో సాంగ్స్ ఛాట్ బస్టర్స్ నిలిచాయి. హనుమాన్ సక్సెస్ తర్వాత గౌర హరి పలు ఇంట్రెస్టింగ్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.
తేజ సజ్జ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్న ‘మిరాయి’ చిత్రానికి కూడా గౌర హరి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు మరో బాలీవుడ్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు గౌర హరి. ఈ ఇయర్ ఆయనకు స్పెషల్ గా ఉండబోతోంది. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మరిన్ని క్రేజీ మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








