Sankranthiki Vasthunnam OTT: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షిచౌదరి నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. అప్పట్నించి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అధికారికంగా తేదీ వెల్లడైంది.
ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా మూడు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, బాలయ్య నటించిన డాకూ మహారాజ్ సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ ఈ మూడు సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేశ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీపై రకరకాల తేదీలు , ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకున్న జీ5 కాస్త విభిన్నంగా ఆలోచన చేసింది. జీ5 ఓటీటీ కంటే ముందే జీ తెలుగు టీవీ ఛానెల్‌లో మార్చ్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్టు జీ5 ప్రకటించింది. అంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా హాయిగా జీ తెలుగు ఛానెల్‌లో ఇంటిల్లిపాదీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వీక్షించే అవకాశం కల్పించింది. మరి జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది స్పష్టత రాలేదు. మార్చ్ 5, 6 తేదీల్లో లేక మార్చ్ 10 నుంచి అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు జీ5 ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అధికారికంగా వచ్చేసింది. ముందుగా అనుకున్నట్టు కాకుండా జీ తెలుగు టీవీ ఛానెల్‌తో పాటే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు సినిమా మేకర్స్ తెలిపారు. అంటే మార్చ్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఇటు జీ తెలుగు టీవీలో అటు జీ5 ఓటీటీలో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. వాస్తవానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లు కూడా ఇలానే విభిన్నంగా జరిగి అందర్నీ ఆకర్షించాయి.
సినిమా నిడివి ఎక్కువగా ఉందనే కారణంతో థియేటర్ వెర్షన్ నుంచి తొలగించిన కొన్ని సన్నివేశాలను ఓటీటీలో చేరుస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మీనాక్షి చౌదరి-వెంకటేశ్ మధ్య కొన్ని సన్నివేశాలు ఓటీటీ వెర్షన్‌లో జోడిస్తున్నారని సమాచారం. అంటే ఓటీటీ రన్‌టైమ్ పెరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









