Sunita Williams: అంతరిక్షంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఎట్టకేలకు క్షేమంగా తిరిగొచ్చారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 3.27 గంటలు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్ క్యాప్యూల్ క్షేమంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంతోషంతో బాణాసంచా కాల్చారు. మేధావులు, సెలెబ్రిటీలు అంతా సునీతాకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ఆమెను కొనియాడుతూ ట్వీట్ చేశారు.
సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి చేరడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్పేస్‌ఎక్స్ క్రూ 10 మిషన్ విజయవంతమైంది. దివి నుంచి భువికి సురక్షితంగా చేరుకోగానే మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన చిరంజీవి ఇద్దరు వ్యోమగాములకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరారు. ఇది నిజమైన బ్లాక్ బస్టర్ అంటూ కొనియాడారు. ఇదొక చారిత్మాత్మక, హీరోయిక్ హోమ్ కమింగ్ అంటూ అభివర్ణించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లకు స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. 8 రోజుల్లో రావాల్సిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ 286 రోజుల తరువాత భూమికి చేరుకున్నారు. ఈ 286 రోజుల్లో భూమి చుట్టూ 4577 సార్లు తిరిగారు గానీ భూమిని చేరుకోలేకపోయారు. నిజంగానే ఈ ఇద్దరి ప్రయాణం ఓ త్రిల్లర్ అడ్వంచర్ సినిమాను తలపిస్తుంది. ఇదే అసలు సిసలు బ్లాక్ బస్టర్ అంటూ కొనియాడారు చిరంజీవి.
WELCOME BACK TO EARTH ?
Sunita Williams & Butch Wilmore !! ?HISTORIC & HEROIC ‘HOME’ COMING!!!
Went for 8 Days to Space & Returned after 286 Days, after an Astonishing 4577 orbits around earth !Your Story is Unmatchably Dramatic, Utterly Nerve - Wracking , Unbelievably…
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 19, 2025
మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టుగా నిజంగానే ఈ ఇద్దరు వ్యోమగాముల 286 రోజుల సాహసయాత్ర ఓ త్రిల్లర్ అడ్వెంచర్. ఈ జర్నీలో ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందులు, ధైర్య సాహసాలపై ఓ సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఇప్పటికే మంగళయాన్ వంటి అంశాలపై సినిమాలు వచ్చాయి. మెగాస్టార్ చెప్పినట్టు ఈ సినిమా వస్తే బ్లాక్ బస్టర్ కావచ్చు.
హాలీవుడ్‌లో అయితే అంతరిక్షం నేపధ్యంతో హైలైఫ్, ఇంటర్‌స్టెల్లార్, గ్రావిటీ, అపోలో 13 వంటి సినిమాలు వచ్చాయి. మరి ఇప్పుడు సునీతా అండ్ విల్మోర్ సాహసయాత్రపై ఏ దర్శకుడు దృష్టి పెడతాడో చూడాలి. కాస్త మసాలా జోడించి సినిమాటిక్ ఫిక్షన్ కూడా చేయొచ్చు. హీరో హీరోయిన్ నేపధ్యంగా కధను మార్చి తీస్తే మరింత ఆకట్టుకోవచ్చు.
Also read: Dolphins Welcome: సునీతా విలియమ్స్‌కు స్వాగతం చెప్పిన డాల్ఫిన్లు, వీడియో ఇదిగో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









