Love Story Begins:అవును ఈ మధ్యకాలంలో హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా.. స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ మెగాఫోన్ పట్టుకుంటున్నారు. ఈ కోవలో మిథున్ చక్రవర్తి అనే కొత్త నటుడు కూడా డైరెక్టర్ గా తెలుగు, తమిళ భాషల్లో ‘లవ్ స్టోరీ బిగిన్స్’ అంటూ ఇప్పటి వరకు ప్రేమకథల్లో భిన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాలో మిథున్ సరసన వర్ష, శ్వేత నటిస్తున్నారు. ఈ సినిమా లో హీరో, హీరోయిన్లపై హీరో-హీరోయిన్లపై పిక్చరైజ్ చేసిన"వస్తావా" అనే గీతాన్ని హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రిలీజ్ చేశారు. అమర్ గీత్ సంగీత సారధ్యంలో శివమణి రాసిన ఈ సాంగ్ ను .. భవదాయిని నాగరాజ్, విద్యుత్ శ్రీనివాస్, థామస్ చిరమేల్ అలెగ్జాండర్ పాడారు. ఇదే పాటను దుబాయి నుంచి కూడా విడుదల చేయడం విశేషం.
సాంగ్ రిలీజ్ తర్వాత యువ సంచలన నటుడు మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ..."చిన్నప్పటినుంచి సినిమాలే లోకంగా పెరిగాను. సినిమాలే నా లైఫ్ అని డిసైడ్ అయ్యాను. నా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. బోలెడు వినోదానికి రవ్వంత సందేశం జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఈ సినినిమా ప్రేమ చిత్రాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
"లవ్ స్టొరీ బిగిన్స్" చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల హీరోయిన్లు వర్ష, శ్వేత హ్యాపీగా ఫీలయ్యారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దుబాయిలో షూటింగ్ జరుపుకునే "లవ్ స్టొరీ బిగిన్స్" ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









