Prabhas Upcoming Movies: ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల జాబితా, రాజా సాబ్ తరువాత వరుసగా 10 సినిమాలు

Prabhas Upcoming Movies: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పండగే. ఒకటి కాదు రెండు కాదు వరుసగా 9 సినిమాలతో డార్లింగ్ చాలా బిజీగా ఉన్నాడు. వీటిలో రెండు మాత్రమే సీక్వెల్ కాగా మిగిలినవి కొత్తగా నిర్మితమౌతున్నవే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 22, 2025, 06:26 PM IST
Prabhas Upcoming Movies: ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల జాబితా, రాజా సాబ్ తరువాత వరుసగా 10 సినిమాలు

Prabhas Upcoming Movies: బాహుబలి తరువాత వరుస పాన్ ఇండియా సినిమాలతో రేంజ్ పెంచుకున్న ప్రభాస్ ఇప్పుడు చేతిలో ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఏకంగా 9 సినిమాలు ఉన్నాయి. ఈ అన్నింటిలో ముందుగా వచ్చేది రాజా సాబ్. 

Add Zee News as a Preferred Source

కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయం దక్కించుకున్న ప్రభాస్ ఒకదాని తరువాత మరొకటిగా వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. బాహుబలితో పాన్ వరల్డ్ హీరోగా మారిన డార్లింగ్  కల్కి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో 9 సినిమాలు ఉన్నాయి. వీటిలో రెండు సీక్వెల్ కాగా మిగిలినవి కొత్త ప్రాజెక్టులు. వీటన్నింటిలో ముందుగా వచ్చేది ప్రముఖ కుటుంబ కధా చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన విడుదల కావల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతున్నందున వాయిదా పడింది. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ నెలలో విడుదల కావచ్చని అంచనా. 

ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే చాలా ఏళ్లు ఫ్రీగా లేనట్టే కన్పిస్తోంది. చేతిలో ఉన్న 9 సినిమాలు కాకుండా ఇంకా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట్టే కన్పిస్తున్నాడు. 600 కోట్ల బడ్జెట్‌తో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేయనున్నాడు. ఇది దేశానికి స్వాతంత్య్రం రాక ముందు జరిగే కధ ఆధారంగా సాగుతుంది. ఆ తరువాత స్పిరిట్, కల్కి 2898 ఏడీ పార్ట్ 2, సలార్ పార్ట్ 2, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒకటి, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై మరో సినిమా ఉన్నాయి. 

ఈ 9 సినిమాలు కాకుండా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మరో మూడు సినిమాలు చేసేందుకు సైన్ చేశాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం అత్యధిక సినిమాలు ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచాడు.

Also read: Delhi High Court: పతంజలి రాందేవ్ షర్బత్ జిహాద్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News