Nagarjuna Met AP CM Babu: ఏపీ సీఎం చంద్రబాబుతో నాగార్జున భేటి.. కారణం ఇదే..

Nagarjuna Met AP CM Babu: అక్కినేని నాగార్జున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసారు. అంతేకాదు తన రెండో కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా వివాహా ఆహ్వాన పత్రికను అందజేశారు.   

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 4, 2025, 08:20 AM IST
 Nagarjuna Met AP CM Babu: ఏపీ సీఎం చంద్రబాబుతో నాగార్జున భేటి.. కారణం ఇదే..

Nagarjuna Met AP CM Babu:  నాగార్జున ఇంట్లో మరోసారి  పెళ్లి  భాజాలు మోగనున్నాయి. లాస్ట్ ఇయర్ నాగ చైతన్య, శోభిత పెళ్లిని చేసిన నాగార్జున.. తాజాగా తన రెండో కుమారుడు అఖిల్ కు వివాహాన్ని  నిశ్చయం చేసాడు.ఇప్పటికే నాగార్జున.. తెలంగాణ ముఖ్యమంత్రిని కలసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన నాగార్జున.. తాజాగా తన రెండో కుమారుడు అఖిల్ వివాహానికి ఏపీ సీఎం ను ఆహ్వానించారు. ఏపీలో చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో కలిసి పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డును అందజేశారు. 

Add Zee News as a Preferred Source

ఈ నెల 6న అఖిల్ పెళ్లి  జైనబ్ రావ్ డ్జీతో  అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి నాగార్జునకు సంబంధించిన బంధు మిత్రులతో పాటు సినీ, క్రీడా, పొలిటికల్ తో పాటు బిజినెస్ మ్యాన్ లను హాజరు కానున్నారు.  ప్రముఖులను ఆహ్వానించనున్నారు. అప్పట్లో నాగ చైతన్య మ్యారేజ్ కు కొన్ని డేస్ ముందే అఖిల్ పూలు పండ్లు  చేసుకున్న విషయాన్ని ఫ్యాన్స్ తో పాటు  మీడియాకు తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. 

నాగార్జనకు కాబోయే  కోడలు జైనబ్ రావడ్జీ స్కిన్ కేర్ స్పెషలిస్ట్.  ఈమె సోషల్ మీడియాను  చాలా మంది హీరోయిన్స్ ఫాలో అవుతున్నారు. అఖిల్ మొదటగా ఉపాసన వాళ్ల చుట్టం అయిన శ్రియా భూపాల్ తో నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ అనుకోకుకండా ఆగిపోయింది. జైనబ్.. దుబాయితో పాటు లండన్ లో చదువుకుంది.  రెండేళ్ల క్రితమే అఖిల్, జైనబ్ మధ్య  పరిచయం ఏర్పిడింది. అది పెళ్లికి దారి తీసింది. అఖిల్ విషయానికొస్తే..‘ఏజెంట్’ మూవీ తర్వాత ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News