Tollywood News: అందరికీ షాక్, పూరీకు ఓకే చెప్పిన స్టార్ హీరో

Tollywood News: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చేసినట్టున్నాయి. సినిమా చేద్దామంటే హీరో దొరకక కెరీర్‌లో అత్యంత దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్న పూరీకు హీరో దొరికేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2025, 05:12 PM IST
Tollywood News: అందరికీ షాక్, పూరీకు ఓకే చెప్పిన స్టార్ హీరో

Tollywood News: ఒకప్పుడు అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకడైన పూరీ జగన్నాధ్ అత్యంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. హీరోల కోసం ప్రయత్నించి విఫలమౌతున్న తరుణంలో ఊహించని ఓ స్క్రిప్ట్‌కు ఊహించని స్టార్ హీరో దొరికేశాడు. ఇంకేం త్వరలోనే పూరీ సినిమా పట్టాలెక్కనుంది. 

Add Zee News as a Preferred Source

ఒకప్పుడు బద్రి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, బుజ్జిగాడు, టెంపర్, బిజినెస్‌మెన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరీ జగన్నాధ్ ఆ తరువాత వరుస పరాజయాలతో మూలనపడిపోయాడు. తిరిగి 2019లో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ అందుకున్నా లైగర్ డిజాస్టర్‌తో కెరీర్‌లో డార్క్ డేస్ ఎదుర్కొన్నాడు. డబుల్ ఇస్మార్ట్ కూడా విఫలం కావడంతో పరిస్థితి మరింత దయనీయమైంది. ఈ పరిస్థితుల్లో  మరో సినిమా కోసం ప్రయత్నించినా ఏ హీరో ముందుకు రాలేదు. గోపీచంద్, నాగార్జునతో సినిమా ఫిక్స్ అయిందని ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎవరూ ఊహించని స్టార్ హీరోను పట్టేశాడు. 

ఇటీవలి కాలంలో విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న తమిళ నటుడు, తెలుగులో కూడా ఫ్యాన్స్ కలిగిన విజయ్ సేతుపతి..మన పూరీ జగన్నాధ్‌కు ఓకే చెప్పేశాడు. ఊహించని స్క్పిప్ట్‌కు విజయ్ సేతుపతిని ఒప్పించినట్టు తెలుస్తోంది. ఇటీవలే మహారాజా సినిమాతోనూ విడుదల 2 సినిమాతోనూ హిట్స్ ఇచ్చిన విజయ్ సేతుపతి కెరీర్ మంచి స్థాయిలో ఉంది. ఇప్పుడు పూరీ జగన్నాథ్‌‌ విజయ్ సేతుపతి సినిమా అంటే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలి. ఎందుకంటే పూరీ జగన్నాథ్ ఎలివేషన్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది. 

విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ తీసే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవాల్సిందే. లేకపోతే ఇండస్ట్రీ నుంచి పూరీ దూరం కావల్సి ఉంటుంది. పూరీ కధ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లోనే విజయ్ సేతుపతి ఓకే చెప్పారంటే పూరీ ఎలాంటి కధ చెప్పారనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు..పూరీ కోసం ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల్ని కూడా పక్కకు జరిపి కాల్ షీట్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also read: Chandrababu: ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం, లేనిపోని రాజకీయాలు చేయొద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News