
Akella Suryanarayana Passes Away: తెలుగు చిత్రసీమలో ఆకెళ్ల పేరుతో పలు సినిమాలకు రచయితగా పని చేసారు ఆకెళ్ల సూర్యనారాయణ. తాజాగా ఈయన అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు డాక్లర్టు తెలిపారు. కానీ ఈ విషయాన్ని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి అంతిమ శ్వాస విడిచారు. 80కి పైగా తెలుగు సినిమాలకు స్టోరీలను అందించారు. ఆకెళ్ల 15 ఏళ్ల పాటు తెలుగు రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆకెళ్ళ కథలు ఎక్కువగా మహిళల ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రాలకు కథలను అందించడం విశేషం.
ఆకెళ్ల సూర్య నారాయణ ..తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో జానకీ, రామయ్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే నాటకాలలో మోజుతో నటించడం మొదలు పెట్టారు. ఆయన నటించే నాటకాలను ఆయనే రాసుకునేవారు. అలా రచయతగా అక్కడే బీజం పడింది. 1960లో బాలరాముడి పాత్రతో నాటకరంగంలోకి లెగ్ పెట్టారు. మొదటగా చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు రాసి పంపించే వారు. డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవలకు శ్రీకారం చుట్టారు. ఈయన సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. వీనిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి తర్జూమా అయ్యాయి. దాదాపు తెలుగులో 800 ఎపిసోడ్స్ కు మాటలు రాశారు. అందులో సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాల్లో రచన చేశారు. 1997లో తొలిసారిగా ‘కాకి ఎంగిలి’ అనే నాటకాన్నిరచించారు. ఆ తరువాత ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్’ లాంటి చారిత్రక నాటకాలు రాశారు.
ఆకెళ్ల రచయితగా పని చేసిన తొలి మూవీ ‘మగమహారాజు’. తర్వాత స్వాతిముత్యం, శ్రుతిలయలు, ఆడదే ఆధారం, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఓ భార్య కథ, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా, ఎంత బావుందో సినిమాలకు రచయితగా పని చేశారు. అంతే కాకుండా అయ్యయ్యో బ్రహ్మయ్య చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.
ఆకెళ్ల సూర్యనారాయణ రచనలకు పలు అవార్డులు కూడా వరించాయి. ముఖ్యంగా విశాలాంధ్ర అవార్డు, ఆంధ్రప్రభ అవార్డు, యువ చక్రపాణి అవార్డు, విజయ మాస పత్రిక అవార్డు వంటివి వచ్చాయి. కాకి ఎంగిలి నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకోనున్నారు. ఆకెళ్ల సూర్యనారాయణకు ఐదుగురు పిల్లలు. అందులో నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆకెళ్ల అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో నిర్వహించనున్నారు. ఆకెళ్ల మృతి పట్ల ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.