Viral Video: సాధారణంగా మల్టీస్టారర్ మూవీ అంటేనే అభిమానులు ఎంతో అద్భుతంగా అత్యుత్సాహంగా సినిమా చూస్తారు. అలాంటిది ఒకే వేదికపై సీనియర్ స్టార్ హీరోలు అంతా కనిపించారు అంటే.. ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.ముఖ్యంగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో పోటీపడే వారికి హీరోలు మాత్రం అలా ప్రవర్తించకుండా ఒకే చోట కనిపించి, వీరిని ఫూల్స్ చేస్తూ ఉంటారనడంలో సందేహం లేదు. వాస్తవానికి సెలబ్రిటీలు బాగానే ఉంటారు. కనిపించినప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటారు కూడా.. కానీ వారి అభిమానులే తమ హీరోల గురించి గొప్పలు చెప్పుకుంటూ గొడవలు పోతూ ఉంటారు.
ఇదిలా ఉండగా చిరంజీవిని మొదలుకొని వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు ఇలా అందర్నీ ఒకే తెరపై చూపిస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితి వర్ణనాతీతం. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంతే.. అలాంటిది ఒక సినిమాలో అందులోనూ ఒక పాటలోఈ స్టార్ సెలబ్రిటీలంతా కనిపించి అభిమానులను అలరించారు.1987లో విడుదలైన భారతీయ తెలుగు భాషా మసాలా చిత్రం ఇది. టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కే. మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్, శోభన, ఖుష్బూ, అశ్విని తదితరులు నటించిన ఈ చిత్రానికి బొప్పిలహరి సంగీతం అందించారు.. 1987 జూన్ 24న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
ఈ సినిమాలోని "ఒకే మాట ఒకే బాట" అనే పాటలో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, భానుప్రియ, విజయశాంతి వంటి వారు కూడా కనిపించారు.
ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు కనిపిస్తేనే భారీగా హైప్ క్రియేట్ చేస్తారు కానీ త్రిమూర్తులు సినిమాలో అగ్ర హీరోలు అందరూ కనిపించారు కానీ ఈ సినిమా యావరేజ్ గా నిలవడం గమనార్హం. ఏది ఏమైనా ఇంతమంది అగ్రతారలు ఒక పాటలో కనిపించిన సినిమా ఇప్పటివరకు మరొకటి రాలేదు. ఇదొక రికార్డు అని చెప్పవచ్చు.
Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్ ప్రజలకు తెలుసు'
Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter









